Home  »  News  »  అఖిల్ నెక్స్ట్ మూవీకి ఆ డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడా.. టాలీవుడ్‌లో క్రేజీ బజ్!

Updated : Jul 18, 2026

 

-అఖిల్ నెక్స్ట్ మూవీకి డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడా!
-ఆ డైరెక్టర్ ఓకే అయితే బాక్స్ ఆఫీస్ మోత ఖాయమే 
-సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారిన రూమర్ 

నవ యువ సామ్రాట్ అఖిల్ అక్కినేని(Akhil Akkineni)అభిమానులు, ప్రేక్షకుల కోరిక మేరకు లెనిన్ తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. వంద కోట్ల కలెక్షన్స్ పోస్టర్ కోసం వాళ్లంతా ఇప్పుడు వెయిటింగ్. రీసెంట్ గా సోషల్ మీడియాలో అఖిల్ నెక్స్ట్ మూవీ గురించి  ఆసక్తికర న్యూస్ రూమర్ హోదాలో హల్ చల్ చేస్తుంది.

పూరి జగన్నాథ్(Puri Jagannadh)..మాస్, క్లాస్ పల్స్ తెలిసిన దర్శకుడు. మహేష్, రామ్ చరణ్, అల్లు అర్జున్  ప్రభాస్, ఎన్టీఆర్ కి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. ఇవ్వడమే కాదు ఆ హీరోల కట్ అవుట్ రేంజ్ కూడా పెంచాడు. ప్రెజెంట్ విజయ్ సేతుపతితో చేస్తున్న స్లమ్ డాగ్ రిలీజ్ కి సిద్ధం కాబోతుంది. పూరి తన నెక్స్ట్ మూవీని అఖిల్ తో చేయబోతున్నాడని, పూరి చెప్పిన ఒక పవర్‌ఫుల్ మాస్ యాక్షన్ లైన్ అఖిల్‌కి నచ్చడంతో  గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే ఊహాగానాలు గట్టిగానే  వినిపిస్తున్నాయి. పూరి సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్లు ఎలా ఉంటాయో  తెలిసిందే. హీరో ఆటిట్యూడ్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్‌లని సరికొత్తగా ఆవిష్కరిస్తాడు. అఖిల్ లాంటి స్టైలిష్ అండ్ ఎనర్జిటిక్ హీరోకి పూరి  మార్క్ రగ్గడ్ ఇమేజ్ తోడైతే థియేటర్లలో పూనకాలే. అఖిల్ కెరీర్‌లో ఇప్పటివరకు ఒక పూర్తి స్థాయి అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ బొమ్మ పడలేదు. లెనిన్ లో ఆ ఛాయలు ఉన్నా, పూరి మార్క్ వేరనే విషయం తెలిసిందే.ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని  ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించబోతోందని, ఈ చిత్రానికి సంబంధించి దాదాపు 80 శాతం స్క్రిప్ట్ వర్క్ కూడా ఇప్పటికే పూర్తయిందని ఫిల్మ్‌నగర్ సమాచారం. 

 also read: The  odissey : ది ఒడిస్సిలో రామాయణ, మహాభారత పోలికలు.. వైరల్ అవుతున్న న్యూస్ 


ఈ కాంబినేషన్ అధికారికంగా సెట్ అయితే, బాక్సాఫీస్ వద్ద లెనిన్ ని మించి సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం. అయితే సినీ సర్కిల్స్ లో మరో ప్రచారం కూడా ఉంది. స్లమ్ డాగ్ ఫలితంపై కూడా  పూరి, అఖిల్ మూవీ ఆధారపడి ఉంటుంది. ఇండస్ట్రీలో అన్నిటికంటే హిట్ మాత్రమే గొప్పదనే విషయం తెలిసిందే. 

akhil akkineni, puri jagannadh, vijay sethupathi, lenin

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.