Home  »  News  »  విజయ్ పై వరలక్ష్మి శరత్ కుమార్ కీలక వ్యాఖ్యలు.. 2018 లోనే ఆ విషయం తెలుసు

Updated : Jul 18, 2026

 

ఏ క్యారక్టర్ లోనైనా తన ప్రభావాన్ని చాలా బలంగా చాటగల నటి వరలక్ష్మీ శరత్ కుమార్(varalaxmi sarathkumar). హీరో ఎంత పెద్ద రేంజ్ కి చెందిన వ్యక్తి అయినా సినిమాలో వరలక్ష్మి ఉందంటే ఇంటికెళ్లిన తర్వాత కూడా తన క్యారక్టర్ గురించి మాట్లాడుకొని ప్రేక్షకుడు ఉండడు. రీసెంట్ గా వరలక్ష్మి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.  


ఇళయ దళపతి విజయ్(Vijay)గురించి ఇన్ స్టాగ్రామ్ వేదికగా చేసిన పోస్ట్ లో 'దళపతి... ఈ పోస్ట్ గురించి ఏం చెప్పాలా అని చాలా సేపు ఆలోచించాను. కానీ అప్పటికే చాలా చెప్పేశారని గ్రహించాను. అందుకే నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. జనాలు వంద రకాలుగా మాట్లాడొచ్చు… కానీ చివరికి, సి. జోసెఫ్ విజయ్ మన ముఖ్యమంత్రి, ఆయన మనతోనే ఉంటారు. విమర్శించడం సులభమే, కానీ మొదటి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడానికి అపారమైన ధైర్యం, పట్టుదల, ఇంకా తమిళనాడు ప్రజల నుండి వెల్లివిరిసే ప్రేమ కావాలి. ఈ అధికార పదవిని గౌరవిద్దాం. మాటల కన్నా చేతలే గొప్పవి. నిరంతరం తప్పులు వెతికే వారికి కాలమే నిజాన్ని వెల్లడిస్తుంది. అప్పటి వరకు, అతను నిజంగా ఏమి సాధిస్తాడో చూడటానికి మనం కొంచెం సహనం, గౌరవం , ప్రోత్సాహాన్ని అందిద్దాం. ఐ లవ్ యూ సార్.. ఎల్లప్పుడూ ‘విజయ్ వెరియన్’ (విజయ్ అభిమాని)గానే ఉంటాను. మమ్మల్ని కలవడానికి సమయం ఇచ్చినందుకు  ధన్యవాదాలు.


lso read: అఖిల్ నెక్స్ట్ మూవీకి ఆ డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడా.. టాలీవుడ్‌లో క్రేజీ బజ్!


సర్కార్ సినిమా రోజులు గుర్తుచేసుకుంటే అది ఇప్పుడు ప్రవచనాత్మకంగా అనిపిస్తుంది. సర్కార్ సినిమా సమయంలోనే మీది ప్రజాసేవ ప్రయాణం అని అర్థమైంది. మహిళా సంక్షేమానికి సంబంధించిన అంశాలు, ఆయన నాయకత్వంలో రాష్ట్రం ఎలా ముందుకు వెళ్లాలనే తన ఆశల గురించి కూడా చర్చించుకున్నాము. ఎల్లప్పుడూ ఆప్యాయంగా, వినయంగా ఉంటారు… తమిళనాడు ప్రజల కోసం జరగబోయే అద్భుతమైన మార్పులని  చూడాలని నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అంటూ  ఇన్ స్టాగ్రామ్ వేదికగా  వెల్లడి చేసింది. విజయ్ వన్ మాన్ షో మూవీ సర్కార్ 2018 లో రాగా వరలక్ష్మి ప్రతి నాయకురాలి క్యారక్టర్ పోషించింది.  

vijay, varalaxmi sarath kumar, sarkar

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.