![]() |
![]() |
.webp)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)హిట్ మూవీస్ లో అత్తారింటికి దారేది కూడా ఒకటి. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ క్యారక్టర్ ని పోషించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన భామ ప్రణీత(Pranitha Subash)సోలో హీరోయిన్ గా కూడా కొన్ని సినిమాల్లో చేసిన ప్రణీత కెరీర్ లో పాండవులు పాండవులు తుమ్మెద, రభస, డైనమేట్, హలో గురు ప్రేమ కోసమే, బ్రహ్మోత్సవం వంటి చిత్రాలు ఉన్నాయి. పలు కన్నడ, తమిళ చిత్రాల్లో కూడా నటించిన ప్రణీత 2021 లో నితిన్ రాజు ని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా కొన్ని చిత్రాల్లో చేసిన ప్రణీత 2024 లో కన్నడంలో వచ్చిన 'రామన్ అవతార' అనే మూవీలో చివరగా కనిపించింది.
కాకపోతే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో టచ్ లో ఉంటూ వాళ్ళు అడిగే పలు ప్రశ్నలకి సమాదానాలు చెప్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఒక అభిమాని ప్రణీతతో మీరు సినిమాల్లో ఎందుకు నటించడం లేదని అడిగాడు. అందుకు ప్రణీత సమాధానమిస్తూ నా పిల్లల వల్లే నేను సినిమాల్లో నటించడం లేదు. తల్లిగా వాళ్ల బాధ్యతలని చూసుకోవాలని తెలిపింది. ఆమెకి ఒక కూతురు, కొడుకు ఉన్నారు.
కన్నడ చిత్ర సీమకి చెందిన ;ప్రణీత అన్ని భాషల్లో కలిపి ఇప్పటి వరకు సుమారు 28 చిత్రాల దాకా చేసింది.
![]() |
![]() |