![]() |
![]() |

ఇది ఓటీటీ యుగం. థియేటర్లలో విడుదలైన మూడు నాలుగు వారాలకే మెజారిటీ సినిమాలు ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. అలాగే కొన్ని సినిమాలు ఓటీటీ కోసమే ప్రత్యేకంగా రూపొందుతున్నాయి. స్టార్స్ సైతం ఓటీటీ కోసం సినిమాలు, సిరీస్ లు చేయడానికి ఆసక్తిచూపుతున్నారు. కీర్తి సురేష్ నటిస్తున్న 'ఉప్పు కప్పురంబు' చిత్రం కూడా నేరుగా ఓటీటీలో అలరించనుంది. (Uppu Kappurambu)
కీర్తి సురేష్, సుహాస్ ప్రధాన పాత్రల్లో అని ఐ.వి. శశి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఉప్పు కప్పురంబు'. ఎల్లనార్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రాధిక లావు నిర్మిస్తున్న ఈ సినిమా జులై 4న అమెజాన్ ప్రైమ్ వీడియోలో అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా పోస్టర్ ను విడుదల చేశారు. స్మశానం నేపథ్యంలో ప్రధాన పాత్రధారులను చూపిస్తూ రూపొందించిన పోస్టర్ ఆకట్టుకుంటోంది.
1990ల నాటి గ్రామీణ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో బాబు మోహన్, శత్రు, తళ్లూరి రామేశ్వరి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో అందుబాటులోకి రానుంది.

![]() |
![]() |