![]() |
![]() |

'బాహుబలి' సిరీస్ తో తెలుగు సినిమా పరిశ్రమకి పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చి పెట్టిన దర్శక ధీరుడు రాజమౌళి(ss Rajamouli). ఆర్ ఆర్ ఆర్(RRR)తో అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ ని కూడా తెచ్చిపెట్టాడు. ప్రస్తుతం మహేష్ బాబు(Mahesh Babu)తో తన కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అమెజాన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ఇండియన్ చిత్ర పరిశ్రమలోనే హయ్యస్ట్ బడ్జెట్ తో రుదిద్దుకోబోతుంది. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే రెండో షెడ్యూల్ ని జరుపుకోనుంది.
రాజమౌళి రీసెంట్ గా నిన్న జరిగిన నాగార్జున(Nagarjuna),ధనుష్(Dhanush)ల 'కుబేర'(Kuberaa)మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రాజమౌళిని ఉద్దెశించి ఈవెంట్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించిన సుమ మాట్లాడుతు 'మీ ఫస్ట్ శాలరీ ఎంత అని అడిగింది. దీంతో రాజమౌళి సుమతో యాభై రూపాయిలని చెప్పాడు. రాజమౌళి చెప్పిన ఈ మాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)కెరిరీలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'స్టూడెంట్ నెంబర్ వన్' చిత్రం ద్వారా రాజమౌళి సినీ రంగానికి పరిచయమయ్యాడు. సినిమా రంగంలోకి రాక ముందు సీరియల్స్ కి కూడా వర్క్ చేసాడు.

![]() |
![]() |