![]() |
![]() |

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచిన చిత్రం `ఇస్మార్ట్ శంకర్` (2019). డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో `ఉస్తాద్` అంటూ మాస్ ఆడియన్స్ ని భలేగా ఎంటర్టైన్ చేశాడు రామ్. కట్ చేస్తే.. ఇప్పుడా `ఉస్తాద్`నే తన నెక్స్ట్ ఫిల్మ్ కి టైటిల్ గా ఫిక్స్ చేసుకున్నాడట రాపో.
ఆ వివరాల్లోకి వెళితే.. `పందెం కోడి` ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో రామ్ కథానాయకుడిగా ఓ ఊరమాస్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీగా రూపొందనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో రామ్ కి జంటగా `ఉప్పెన` ఫేమ్ కృతి శెట్టి కనిపించనుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి `ఉస్తాద్` అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారట రామ్ అండ్ కో. త్వరలోనే ఈ టైటిల్ కి సంబంధించి ఫుల్ క్లారిటీ రానుంది. కాగా, జూలై 12 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రంలో రామ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లు సమాచారం. శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
![]() |
![]() |