![]() |
![]() |

రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'రాధే శ్యామ్'. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఇక నేడు(ఆగస్ట్ 30) కృష్ణాష్టమి సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ తో సర్‌ప్రైజ్ చేసింది చిత్ర బృందం.
కృష్ణాష్టమి సందర్భంగా సోమవారం ఓ సర్ ప్రైజింగ్ పోస్టర్ ను రిలీజ్ చేసింది మూవీ టీమ్. ఈ పోస్టర్‌లో ప్రభాస్, పూజాల లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. నెమలి పించాలతో నీలి రంగు డ్రెస్ లో ఉన్న పూజా.. సంగీత సాధన చేస్తుండగా.. ఆ పక్కనే చిరునవ్వులు చిందిస్తూ ప్రభాస్ నిల్చొని ఉన్నాడు. ఈ పోస్టర్ చాలా క్లాసీగా ఎట్రాక్టివ్ గా ఉంది.

యూరప్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్నఈ సినిమాలో విక్రమాదిత్యగా ప్రభాస్, ప్రేరణగా పూజా కనిపించనున్నారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా 2022 జనవరి 14న విడుదల కానుంది.
![]() |
![]() |