![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ లో నటిస్తున్న చిత్రం `గాడ్‌ఫాదర్`. మాలీవుడ్ బ్లాక్‌బస్టర్ `లూసిఫర్`కి రీమేక్‌గా రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీని `హనుమాన్ జంక్షన్` ఫేమ్ మోహన్ రాజా తెరకెక్కిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ బాణీలు అందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఇటీవలే పట్టాలెక్కింది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా టాలెంటెడ్ యాక్టర్ మాధవన్ నటించబోతున్నట్లు సమాచారం. మాతృకలో వివేక్ ఒబెరాయ్ పోషించిన పాత్రలో మాధవన్ కనిపిస్తాడని వినికిడి. ఇదివరకు మాలీవుడ్ యాక్టర్ బిజూ మీనన్ పేరు కూడా వినిపించింది. అయితే, ఇప్పుడీ వేషంలో మాధవన్ దర్శనమివ్వబోతున్నట్లు టాలీవుడ్ టాక్. త్వరలోనే `గాడ్‌ఫాదర్`లో మాధవన్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. మరి.. చిరుని తొలిసారిగా ఢీ కొడుతున్న మాధవన్.. ఈ మెగా ప్రాజెక్టుతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.
కాగా, మాధవన్ గతంలో `సవ్యసాచి`, `నిశ్శబ్దం` వంటి తెలుగు చిత్రాల్లో విలన్‌గా నటించాడు. ఈ రెండు సినిమాలు కూడా ఆశించిన విజయాన్ని సాధించలేదు.
![]() |
![]() |