![]() |
![]() |

క్రిష్ డైరెక్షన్‌లో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న సినిమా బ్యాక్‌డ్రాప్ ఏమిటో తెలిసింది. అవును. ఆ విషయాన్ని కల్యాణ్ అన్నయ్య నాగబాబు లీక్ చేశారు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం పింక్ రీమేక్ అయిన వకీల్ సాబ్ మూవీతో పాటు క్రిష్ డైరెక్షన్‌లో ఇంకో మూవీని కూడా చేస్తున్నారు. స్వాతంత్ర్య పూర్వ కాలం నాటి కథతో ఈ సినిమా తయారవుతోందని ఇదివరకే సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి ప్రచారం జరిగింది. ఈ సినిమా కోసం ప్రొడ్యూసర్ ఎ.ఎం. రత్నం విరూపాక్ష, వారాహి అనే రెండు టైటిల్స్ రిజిస్టర్ చేయించి పెట్టారు. త్వరలోనే ఈ రెండింట్లో ఒకదాన్ని టైటిల్‌గా ప్రకటిస్తారని అంచనా.
కాగా తాజాగా ఈ సినిమా నేపథ్యం గురించి తన దగ్గర ఉన్న సమాచారమంటూ నాగబాబు రెండు విషయాలు బయటపెట్టారు. ఒకటి.. ఇది మొగలాయిల కాలంలో జరిగే కథ అయితే, ఇంకోటి.. కోహినూర్ వజ్రం నేపథ్యంలో ఈ కథ నడుస్తుందనేది. టైటిల్ ఏమిటనేది మాత్రం తనకూ తెలియదని నాగబాబు తెలిపారు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఈ విషయాన్ని వెల్లడించారు నాగబాబు. ఆయన చెప్పింది నిజమే అయితే ఒక పీరియడ్ ఫిల్మ్‌లో, అందునా కోహినూర్ డైమండ్ నేపథ్యంలో సాగే కథలో పవన్ కల్యాణ్‌ను చూడటం ఫ్యాన్స్‌కు కొత్త అనుభవాన్ని ఇస్తుందనేది గ్యారంటీ.
![]() |
![]() |