![]() |
![]() |

ప్రస్తుతం శ్రియ స్పెయిన్‌లోని బార్సిలోనాలో ఉంది. భర్త ఆండ్రీ కొశ్చీవ్‌తో కలిసి! అయితే, ఇద్దరూ ఒకే గదిలో ఉండడం లేదు. వేర్వేరు గదుల్లో నిద్రిస్తున్నారు. దీనికి కారణం కరోనా! శ్రియ భర్త ఆండ్రీకి పొడి దగ్గు, జ్వరం వంటి కరోనా లక్షణాలు కనిపించడంతో ఎందుకైనా మంచిదని వేర్వేరు గదుల్లో నిద్రించడంతో పాటు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే అతడికి కరోనా లేకపోవడంతో శ్రియ ఊపిరి పీల్చుకుంది. బార్సిలోనాలో ఉండటంతో కోవిడ్19 ఎంత త్వరగా ప్రజల జీవితాల్ని మార్చిందో తనకు తెలిసిందని ఆమె చెప్పింది.
"మార్చి 13 మా పెళ్లి రోజు. సెలబ్రేట్ చేసుకోవాలని నేను, ఆండ్రీ బయటకు వెళ్లాం. ఒక రెస్టారెంట్ లో టేబుల్ రిజర్వేషన్ చేసుకున్నాం. అయితే... అది మూసి ఉంది. అప్పుడు పరిస్థితి సీరియస్ అని అర్థమైంది. తర్వాత మరోరోజు మేం బయటకు వెళితే... పోలీసులు ఆపేశారు. ఆండ్రీ వైట్ (తెల్ల జాతీయుడు), నేను బ్రౌన్ కావడంతో భార్యాభర్తలం అని తెలియక వదిలేశారు. బార్సిలోనాలో ఇంటికి ఒకరి కంటే ఎక్కువమంది బయటకు రానివ్వడం లేదు. తర్వాత ఆండ్రీకి దగ్గు, జ్వరం రావడంతో నేను మరింత టెన్షన్ పడ్డా. థాంక్ గాడ్... ఇప్పుడు మా ఆయన ఆరోగ్యం బాగుంది" అని శ్రియ చెప్పింది. ముంబైలో ఉంటున్న తల్లితో ప్రతిరోజూ వీడియో కాల్ ద్వారా మాట్లాడుతున్నానని ఆమె తెలిపింది. అమ్మ చెప్పిన రెసిపీలతో వంటలు కూడా వండుతున్నారట.
![]() |
![]() |