Home  »  News  »  కరోనా కాల్ సెంటర్‌లో ప‌ని చేస్తోన్న‌ హీరోయిన్

Updated : Apr 14, 2020

 

అల్లరి నరేష్ సరసన 'మేడ మీద అబ్బాయి' సినిమాలో నటించిన నిఖిలా విమల్ గుర్తుందా? ఆ తర్వాత తెలుగులో మరో సినిమా చేసింది. 'గాయత్రి'లో మంచు మోహన్‌బాబు కుమార్తెగా నటించింది. ఇప్పుడీ హీరోయిన్ కరోనా కాల్ సెంటర్‌లో తన సేవలు అందిస్తోంది. అసలు వివరాల్లోకి వెళితే... నిఖిలా విమల్  సొంతూరు కేరళలోని తలిపారంబ. అక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో కన్నూర్ జిల్లా పంచాయత్ ఆఫీసులో కరోనా కాల్ సెంటర్ ఉంది. లాక్‌డౌన్ సమయంలో ప్రజలు ఇంటి నుండి బయటకు అడుగుపెట్టకుండా, ఫోనులో వాళ్లకు అవసరమైన నిత్యావసరాలను సరఫరా చేయడంలో ఈ కాల్ సెంటర్ సహాయం చేస్తోంది. తనకు తాను స్వచ్ఛందంగా కాల్ సెంటర్‌లో నిఖిల పని చేస్తోంది. తన సేవలు అందిస్తోంది.

"ప్రజలకు వాలంటీర్ల ద్వారా అవసరమైన వస్తువులు అందించడమే కాల్ సెంటర్ మోటో. అందువల్ల, ప్రజలు బయటకు రారు కదా. ఫోన్ చేసిన ప్రజలతో మాట్లాడి, వాళ్లకు కావాల్సిన వస్తువుల లిస్ట్ రాసుకుని ఇవ్వడమే నా పని. ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కరోనా కాల్ సెంటర్‌లో పని చేస్తున్నా. ప్రయాణాలపై ఆంక్షలు, పరిమితులు విధిస్తుండడంతో రోజూ వెళ్లలేకపోతున్నా" అని నిఖిలా విమల్ తెలిపింది. ప్రముఖులు ఈ విధమైన సేవ చేయడం ద్వారా ప్రజల్లో చైతన్యం వస్తుంది. పరిస్థితులపై అవగాహన ఏర్పడుతుంది.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.