![]() |
![]() |
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషన్ ‘ఓజీ’ ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సంచలనం సృష్టిస్తోంది. ఒకరోజు ముందు నుంచే థియేటర్ల దగ్గర ప్రేక్షకులు, అభిమానుల కోలాహలం మొదలైంది. పవర్‌స్టార్‌ను కొత్తగా ప్రజెంట్ చేసిన ఈ సినిమాను చూసేందుకు జనం ఎగబడుతున్నారు. ముఖ్యంగా ఫ్యాన్స్ ఓజీ ఫీవర్‌తో ఊగిపోతున్నారు. ఇక సినిమా పూర్తయిన తర్వాత వారి హంగామా మామూలుగా లేదు. ప్రతి ఒక్కరూ పవర్‌స్టార్ స్టామినా గురించి, సినిమాలో తమ హీరో పెర్‌ఫార్మెన్స్ గురించి అరిచి అరిచి చెబుతున్నారు. మల్టీప్టెక్స్‌లు, సింగిల్ థియేటర్స్ అనే తేడా లేకుండా ప్రతి థియేటర్ దగ్గర ఇదే హడావిడి కనిపిస్తోంది. ‘ఓజి’ సినిమా చూసిన ప్రేక్షకులు, అభిమానులు ఏమంటున్నారో వారి మాటల్లోనే..
‘ఇప్పటివరకు పవన్ కళ్యాణ్‌ను ఏ డైరెక్టర్ ఇలా చూపించలేదు. ప్రతి సీన్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. ముఖ్యంగా కత్తి పట్టి నరికే సీన్స్ అన్నీ అదిరిపోయాయి. దసరా పండగ వారం ముందే వచ్చింది. మా అభిమానులందరికీ ఇదే పెద్ద పండగ’
‘మాలాగే ఎర్ర కండువా కట్టుకొని పవర్‌స్టార్ సినిమాలకు హంగామా చేసిన పవన్‌కళ్యాణ్ ఫ్యాన్ సుజిత్.. ఇంతటి అద్భుతమైన సినిమా చెయ్యడం నిజంగా గ్రేట్. పవర్‌స్టార్‌ని ఎలా చూడాలని మేం అనుకుంటున్నామో దాన్ని హండ్రెడ్ పర్సెంట్ స్క్రీన్ మీద చూపించాడు సుజిత్’
‘ఇన్ని సంవత్సరాల సినీ చరిత్రలో ఇలాంటి ఇంటర్వెల్ బ్యాంగ్ ఏ సినిమాలోనూ రాలేదు. కొన్ని సంవత్సరాలుగా ఆకలితో ఉన్న పవర్‌స్టాన్ ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్‌లాంటి సినిమా ‘ఓజీ’. ఫ్యాన్సే కాదు, జనరల్ ఆడియన్స్ కూడా మళ్ళీ మళ్లీ చూడాలనుకునే సినిమా ఇది’
‘పవర్‌స్టార్‌కి ఎప్పటికీ తిరుగుండదని ‘ఓజీ’ ప్రూవ్ చేసింది. పవన్‌కళ్యాణ్ ఊచకోతను ఎవరూ ఆపలేరు. ఇంతకుముందు ఎప్పుడూ చూడని ఒక కొత్త గెటప్‌లో పవర్‌స్టార్ ఉన్నారు. అలాగే పవన్ కెరీర్‌లో చేయని ఒక కొత్త బ్యాక్‌డ్రాప్ మూవీ ఇది’
‘ఇప్పటి వరకు హీరో ఎలివేషన్స్ అంటే కెజిఎఫ్ లాంటి సినిమా గురించే చెప్పుకునేవారు. ఇప్పుడు తెలుగులో కూడా అలాంటి డైరెక్టర్ ఉన్నాడు, హీరోలకు ఎంత ఎలివేషన్ ఇవ్వాలో అంత ఇస్తాడు అని ప్రూవ్ చేశాడు సుజిత్’
![]() |
![]() |