![]() |
![]() |

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)కి సరైన సినిమా పడితే ఎలా ఉంటుందో 'ఓజి'(OG)ద్వారా సిల్వర్ స్క్రీన్ కి మరోసారి తెలిసింది. వర్షాలని సైతం లెక్క చెయ్యకుండా అభిమానులతో పాటు, పాన్ ఇండియా ప్రేక్షకులు ప్రీమియర్స్ నుంచే థియేటర్స్ కి పరుగులు తీశారు. దీంతో ఓజి రికార్డు కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ని ముంచెత్తుతుంది.
తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కూడా కలుపుకొని 155 కోట్ల రూపాయల గ్రాస్ ని రాబట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీంతో రజనీకాంత్ కూలీ, విజయ్ లియో, రణబీర్, సందీప్ రెడ్డి వంగ ల యానిమల్, షారుక్ జవాన్ చిత్రాల తొలి రోజు రికార్డ్స్ కనుమరుగయ్యాయి. దీంతో ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. పవన్ తన ఎంటైర్ కెరీర్ లోనే 155 కోట్ల రూపాయలు వసూలు చెయ్యడం ఫస్ట్ టైం. అయితే ఈ కలెక్షన్స్ వివరాలపై 'ఓజి' మేకర్స్ నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది.
పవన్ ని మునుపెన్నడూ చూపించని విధంగా సుజీత్(sujeeth)సీన్స్ ని క్రియేట్ చేయడంతో పాటు, దర్శకత్వ ప్రతిభ, పవన్ కి ఇచ్చిన ఎలివేషన్స్ ఫ్యాన్స్ తో పాటుప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి.దీంతో పాటు ముంబై నేపథ్యంలో గ్యాంగ్ స్టార్స్ మధ్య కథ జరగడం, ఫోటో గ్రఫీ మెయిన్ బలంగా నిలిచాయి. అందుకు తగ్గట్టే పవన్ తో పాటు మిగతా నటీనటులు పోటాపోటీగా నటించడంతో ప్రేక్షకులని ఓజి మెస్మరైజ్ చేస్తుంది.
![]() |
![]() |