![]() |
![]() |
రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన ‘కాంతార’ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దీనికి ప్రీక్వెల్‌గా రిషబ్ రూపొందించిన ‘కాంతార చాప్టర్ 1’.. దసరా సందర్భంగా విడుదలైంది. ఈ చిత్రాన్ని చూసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘కాంతార’ యూనిట్‌ను మనస్ఫూర్తిగా అభినందించారు. రిషబ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల జరిగిన కాంతార ఫంక్షన్‌కి ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై సినిమా డెఫినెట్‌గా పెద్ద విజయం సాధిస్తుందని ఆశీర్వదించారు. ఇప్పుడు అతని మాటల్ని నిజం చేస్తూ సినిమా పాజిటివ్ రిపోర్ట్‌తో రన్ అవుతోంది.
‘కాంతార1’ చిత్రాన్ని చూసిన ఎన్టీఆర్ తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ‘కాంతార ప్రీక్వెల్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. రిషబ్‌కు నటుడుగా, దర్శకుడుగా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. వాటిని అద్భుతంగా ఆవిష్కరించారు. ఊహకందని ఇలాంటి సినిమా చేయడం రిషబ్‌కే సాధ్యం. అతన్ని నమ్మి ఇంత గొప్ప సినిమాను నిర్మించిన హోంబలే ఫిలింస్ సంస్థకు, చిత్ర యూనిట్ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అన్నారు.
![]() |
![]() |