![]() |
![]() |
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో సింహా, లెజెండ్, అఖండ వంటి భారీ బ్లాక్‌బస్టర్స్‌తో హ్యాట్రిక్ సాధించారు. ఇప్పుడు రెండో హ్యాట్రిక్‌కి శ్రీకారం చుడుతూ ఇద్దరి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘అఖండ2: తాండవం’ చిత్రంపై మొదటి నుంచీ భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. మొదట ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25న విడుదల చెయ్యాలనుకున్నారు. కొన్ని కారణాల వల్ల రిలీజ్‌ను వాయిదా వేశారు. విజయదశమి రోజున ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ విడుదల తేదీని కూడా రివీల్ చేశారు.
డిసెంబర్ 5న ‘అఖండ2’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. వాస్తవానికి ఈ డేట్‌కి ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘రాజాసాబ్’ విడుదల కావాల్సి ఉంది. దీన్ని జనవరి 9కి పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడా డేట్‌కి ‘అఖండ2’ ప్రేక్షకుల్ని పలకరించబోతోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం. తేజస్విని నందమూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. గతంలో విడుదలైన టీజర్ అందర్నీ ఆకట్టుకుంది. సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. విజయదశమి రోజున విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్‌లో పొడవాటి జుట్టు, గడ్డంతో, మెడలో రుద్రాక్షలు ధరించిన బాలకృష్ణ ఎంతో గంభీరంగా కనిపిస్తున్నారు. దీంతో ‘అఖండ2’ మరో సెన్సేషన్ క్రియేట్ చేయబోతోందని నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
![]() |
![]() |