![]() |
![]() |
సంగీత ప్రపంచంలో విశిష్టమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని తనకంటూ ప్రత్యేకమైన బాణీని ఏర్పరుచుకున్నారు పండిట్ చన్నులాల్ మిశ్రా. శాస్త్రీయ గాయకుడిగా ఆయనకు విశేషమైన పేరు ఉంది. భారతీయ సంగీతానికి మిశ్రా చేసిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలను ఆయనకు అందించింది. వయసు రీత్యా వచ్చిన ఆరోగ్య సమస్యల వల్ల అక్టోబర్ 2న ఆయన కన్నుమూశారు. ఉత్తర ప్రదేశ్‌లోని తన కుమార్తె నివాసంలో తుదిశ్వాస విడిచారు. మిశ్రా మృతి పట్ల సంగీత ప్రపంచంలో ఉన్న దిగ్గజ కళాకారులంతా తమ సంతాపాలను తెలియజేశారు.
ప్రధాన మంత్రి మోది కూడా తన సంతాపాన్ని తెలియచేస్తూ ‘చన్నులాల్ మిశ్రా తన జీవితాన్ని సంగీతానికే అంకితం చేశారు. శాస్త్రీయ సంగీతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడంతోపాటు విదేశాలలో భారతీయ సంగీతానికి ఉన్న ప్రాధాన్యతను చాటి చెప్పిన ఘనత ఆయనకే దక్కుతుంది. మిశ్రాగారి ఆశీర్వాదాలు పొందడం నా అదృష్టంగా భావిస్తాను. 2014లో వారణాసి నుంచి పోటీ చేసేందుకు ఆయన నా పేరును ప్రతిపాదించారు’ అంటూ మిశ్రాతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు మోడి. అలాగే ఆయన కుటుంబ సభ్యులకు తన సతాపాన్ని తెలిపారు.
![]() |
![]() |