![]() |
![]() |

గుంటూరుకు చెందిన ఐజీ కుమారుడు వెంకటచైతన్య జొన్నలగడ్డతో మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారికా కొణిదెల వివాహం నిశ్చయమైంది. కాబోయే భర్తతో కలిసి దిగిన ఫొటోలను నిహారిక సోషల్ మీడియా సైట్లలో పోస్ట్ చేశారు. అందులో ఓ ఫొటోలో చైతన్యను ముద్దాడుతూ కనిపించారు. దాంతో నిహారికది ప్రేమ వివాహం కాబోలు అనే మాటలు వినిపించాయి. అయితే, ఇది పెద్దలు కుదిర్చిన వివాహమే. పిల్లలకు ముందుగా పరిచయం లేదని, పెద్దలు మాట్లాడుకుని అంతా ఓకే అనుకున్న తర్వాత పిల్లలు కలిశారని వరుడు చైతన్య తండ్రి, ఐజి ప్రభాకరరావు తెలిపారు. అసలు, ఈ సంబంధం కుదిర్చింది మెగాస్టార్ అని టాక్.
చిరంజీవి తండ్రి కొణిదెల వెంకటరావు పోలీస్ ఉద్యోగి అనేది తెలిసిందే. ఆయనకు గుణ వెంకటరత్నం అని ఓ స్నేహితుడు ఉన్నారు. ఇద్దరూ మంచి స్నేహితులు కావడంతో కుటుంబాల మధ్య కూడా పరిచయం ఉంది. వెంకటరత్నం కుమార్తె పద్మను ఐజి ప్రభాకరరావుకి ఇచ్చారు. ఐజీతోనూ చిరంజీవి స్నేహం కొనసాగించారు. ఆయన కుమారుడే నిహారికను చేసుకోబోయే చైతన్య.
ఇటీవల చిరంజీవి, ప్రభాకరరావు కలిసినప్పుడు.... మాటల మధ్యలో తమ కుమారుడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నట్టు ప్రభాకరరావు అన్నారట. ఎప్పట్నుంచో తెలిసిన కుటుంబం, ఫ్యామిలీతో పాటు కుర్రాడు కూడా మంచివాడు కావడంతో నిహారికకు ఇచ్చి చేస్తే బావుంటుందని చిరంజీవి అనుకున్నారట. ఆయనే పెళ్లి ప్రతిపాదన తీసుకువెళ్లారని సమాచారం. ప్రభాకరరావు ఫ్యామిలీ సంతోషంగా యస్ అన్నారట.
![]() |
![]() |