![]() |
![]() |

హాలీవుడ్‌లో కరోనా కారణంగా కొందరు సినీ ప్రముఖులు మృత్యువాత పడ్డారు. టామ్ హాంక్స్ వంటి స్టార్స్ కొందరు కరోనా బారినుండి కోలుకున్నారు. బాలీవుడ్‌లో యువ సంగీత దర్శకుడు, సాజిద్-వాజిద్ ద్వయంలో వాజిద్ ఖాన్ కరోనా కారణంగా మృతి చెందారు. తాజాగా తెలుగు సినిమా కుటుంబంలో ఒకరిని కరోనా బలి తీసుకుంది. అసలు వివరాల్లోకి వెళితే...

తెలుగు చలనచిత్ర పరిశ్రమ స్వర్ణయుగపు నిర్మాతలలో ఒకరైన బొమ్మిరెడ్డి నాగిరెడ్డి మనవడు శరత్ రెడ్డి కరోనా కాటుకు బలయ్యారు. శుక్రవారం ఉదయం చెన్నైలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు 52 సంవత్సరాలు. 'మిస్సమ్మ', 'మాయాబజార్', 'గుండమ్మ కథ' వంటి ఆణిముత్యాలను నాగిరెడ్డి నిర్మించారు. ఆయన వారసులు 'చందమామ', 'బొమ్మరిల్లు', 'విజయ' వంటి పత్రికలను నిర్వహించారు. ఇన్నాళ్లు హాలీవుడ్, బాలీవుడ్ పరిశ్రమలను కలవరపెట్టిన కరోనా.. ఇప్పుడు టాలీవుడ్ కి సైతం తాకింది.
![]() |
![]() |