![]() |
![]() |

దర్శకుడు మణిరత్నం సినిమాలకు ప్రేక్షకులలో ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే 2018 విడుదలైన నవాబ్ తర్వాత ఆయన దర్శకత్వంలో సినిమా రాలేదు. గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ చూడని ఆయన ఇప్పుడు 'పొన్నియన్ సెల్వన్' అనే భారీ మూవీని రూపొందిస్తున్నారు. సుప్రసిద్ధ తమిళ రచయిత కల్కి రాసిన నవల ఆధారంగా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.
'పీఎస్-1' పేరిట రూపొందుతున్న మొదటి భాగాన్ని 2022లో రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థలు లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సోమవారం ప్రకటించాయి. ఇందుకు సంబంధించిన పోస్టర్ ని కూడా విడుదల చేశారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ జరుగుతోంది. భారీ విజువల్ వండర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని చిత్రబృందం చెబుతోంది.
ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్, కీర్తి సురేష్, విక్రమ్, జయం రవి వంటి ఎందరో ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. ఈ భారీ ప్రాజక్ట్ కు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
![]() |
![]() |