Home  »  News  »  మెగా షాక్: దసరా రేస్ నుంచి విశ్వంభర అవుట్.!

Updated : Aug 27, 2026

మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'బింబిసార' ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ ‘విశ్వంభర’. ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్ కోసం మెగా అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా, VFX వర్క్స్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. 

2025 సంక్రాంతి టార్గెట్ గా పట్టాలెక్కిన 'విశ్వంభర', పలుసార్లు పోస్ట్ పోన్ అయింది. ఈ ఏడాది దసరా బరిలో సినిమాను దింపాలని నిర్మాతలు గట్టిగా ప్రయత్నాలు చేశారు. ఆ రకంగానే ఇండస్ట్రీ వర్గాల్లో దసరా రేసులో ‘విశ్వంభర’ రిలీజ్ కానుందనే టాక్ గట్టిగా నడిచింది. కానీ ఇప్పుడు దసరాకు కూడా రావడం లేదని తెలుస్తోంది.

నిజానికి దసరా రేస్ లో టాలీవుడ్ నుంచి ‘విశ్వంభర’ ఒక్కటే ముందుగా రిలీజ్ డేట్ లాక్ చేసుకుంటుందని ఫిలిం సర్కిల్స్‌లో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అనూహ్యంగా విజయ్ దేవరకొండ నటిస్తున్న భారీ చిత్రం ‘రణబాలి’ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 16న రిలీజ్ చేయనున్నట్లు తాజాగా అనౌన్స్ చేశారు. 

‘విశ్వంభర’ విడుదల వాయిదా పడుతోందని, ఈ దసరాకు రావడం లేదని కన్ఫర్మేషన్ వచ్చాకే.. ‘రణబాలి’ మేకర్స్ తమ దసరా రిలీజ్ డేట్ ను అధికారికంగా అనౌన్స్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

 

 

 

[Chiranjeevi, Vishwambhara, Vijay Deverakonda, Ranabaali]

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.