Home

»

Latest News

స్టార్ హీరోల ఫ్యాన్స్‌కి నిరాశ.. టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల రచ్చ

Aug 27, 2026 5:37PM

 

ఈ ప్రపంచంలో ఎక్స్ పైరీ డేట్ లేని ఆనందం ఏదైనా ఉంది అంటే సినిమా. అందుకే    రీ రిలీజ్ కల్చర్ ఓ రేంజ్‌లో జరుగుతుంది. దాదాపుగా సినిమా పుట్టిన దగ్గర్నుంచే రీ రిలీజ్ కల్చర్ అనేది. కాకపోతే సోషల్ మీడియా పుట్టుక వల్ల రీ రిలీజ్ ఆనవాళ్లు అభిమానులు, సినీ ప్రపంచానికి దగ్గరగా చేరుతున్నాయి. ఇక  తమ అభిమాన హీరోల పుట్టినరోజుల సందర్భాల్లో లేదా ప్రత్యేక వేడుకల్లో వింటేజ్ క్లాసిక్స్, ఇండస్ట్రీ హిట్లను మళ్లీ పెద్ద తెరపై చూసేందుకు అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఈ రీ-రిలీజ్‌లు ఫ్యాన్స్‌ లో జోష్ తీసుకురావాల్సింది పోయి తీవ్ర నిరాశని  మిగులుస్తున్నాయి. చివరి నిమిషంలో చిత్రాల విడుదలలు వాయిదా పడటం, సాంకేతిక లోపాలు తలెత్తడం వల్ల అభిమానులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు.

ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఆయన కెరీర్‌లోని ఆల్-టైమ్ మాస్ ఎంటర్‌టైనర్ 'ముఠామేస్త్రీ' చిత్రాన్ని గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేశారు. మెగా ఫ్యాన్స్ అంతా థియేటర్ల వద్ద కటౌట్లు కట్టి, బ్యానర్లు వేసి, సంబరాలు చేసుకోవడానికి 100% సిద్ధమయ్యారు. అయితే డిజిటల్ రీమాస్టరింగ్ పూర్తయిన తర్వాత ఫైనల్ అవుట్‌పుట్‌లో 4K క్వాలిటీ లోపాలు మరియు కొన్ని సాంకేతిక సమస్యలు బయటపడటంతో మేకర్స్ ఈ సినిమా రీ-రిలీజ్‌ను చివరి నిమిషంలో తాత్కాలికంగా వాయిదా వేశారు. క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.


Also Read: ఇరుముడి నటికి బెదిరింపులు.. రోడ్డుపై కనిపిస్తే కొడతాం 

మరోవైపు అక్కినేని నాగార్జున కెరీర్‌లో మ్యాజికల్ లవ్ స్టోరీగా నిలిచిన 'గీతాంజలి' రీ-రిలీజ్ విషయంలోనూ దాదాపు ఇదే పరిస్థితి పునరావృతమైంది. 100% పర్‌ఫెక్ట్ పిక్చర్ అండ్ సౌండ్ క్వాలిటీ అందించాలనే క్రమంలో టెక్నికల్ ఇష్యూస్ రావడం వల్ల అక్కినేని అభిమానులు కూడా నిరాశ చెందక తప్పలేదు. సాధారణంగా అభిమానులు వందలాది రూపాయలు పెట్టి టికెట్లు కొనుగోలు చేసి, థియేటర్లని తమ ఆధీనంలోకి తీసుకుంటారు. . కానీ ఈ వాయిదాల పర్వం వారి ఉత్సాహంపై నీళ్లు చల్లుతోంది.

Mutha Mestri, Geethanjali, Tollywood, TeluguCinema,TeluguNews,TeluguCinemaNews, TeluguOneDotCom

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com