Home  »  News  »  ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి.. స్వామియే శరణమయ్యప్ప

Updated : Aug 24, 2026

 

హీరో.. అభిమానులతో పాటు టోటల్ మానవాళికి లభించిన మిరుమిట్లు గొలిపే అరుదైన గ్రహం. ఎప్పటికప్పుడు నవ శకానికి నాంది పలికే  డైనమేట్ కూడా. హీరో అంటే కేవలం ఫైట్లు, డ్యాన్సులు, బాక్సాఫీస్ రికార్డులే కాదు, సమాజానికి మంచి మార్గం చూపించే బాధ్యత గల శక్తి అని సుదీర్ఘ కాలం నుంచి నిరూపిస్తు వస్తున్నారు. 


ఈ క్రమంలోనే మాస్ మహారాజా రవితేజ నుంచి వచ్చిన ‘ఇరుముడి’ సినీ పరిశ్రమలోనే కాకుండా సమాజంలోనూ ఒక గొప్ప చర్చకి  తెరలేపింది. కేవలం ఒక తండ్రిగా తన కూతురిని ప్రేమించడమే కాకుండా, ప్రతి ఆడపిల్లలోను నా కూతుర్ని చూసుకుంటాను. వాళ్ళకి  ఏ కష్టం వచ్చినా తండ్రిగా  అండగా ఉంటాను అని రవితేజ చెప్పే సంభాషణలు ప్రేక్షకుల హృదయాలని కట్టిపడేస్తున్నాయి. అంతే కాకుండా సమాజంలో ఆడపిల్లల భద్రత మరియు గౌరవం పట్ల ఎంతటి బాధ్యత ఉండాలో ప్రతి ఒక్కరికీ గుర్తుచేస్తోంది. రవితేజ అనే కాదు అందరూ హీరోలు తమ సినిమాల్లో సామాజిక బాధ్యతని గుర్తు చేస్తున్నారు. దీని వల్ల సమాజంలో మార్పు రావడమనేది జరుగుతుంది. ముఖ్యంగా డై హార్ట్ ఫ్యాన్స్, ఫ్యాన్స్  తమ హీరో దారిలో పయనించడం తధ్యం. స్టార్ హీరోలు ఇలాంటి సందేశాత్మకమైన కథలతో ముందుకు రావడం వల్ల వారి అభిమానులు కేవలం సినిమాను ఆస్వాదించడమే కాకుండా, నిజ జీవితంలోనూ బాధ్యతాయుత పౌరులుగా మారేందుకు ప్రేరణ పొందుతున్నారు. రవితేజ చెప్పిన ఈ మాటలు, చూపించిన భావోద్వేగాలు నేటి సమాజంలో ఆడపిల్లల పట్ల చూపే కోణాన్ని తప్పకుండా మారుస్తాయని, ఒక మంచి సామాజిక మార్పుకు పునాది వేస్తాయని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.  

Also Read: చితి చివరి దాకా ఆయనే 

ఇరుముడి సినిమా విషయానికి వస్తే సాధారణ కుటుంబాలలో ఆడపిల్లలు బయటకు వెళ్లి మాట్లాడటానికి భయపడే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో, ఈ చిత్రం ఆడపిల్లలకు ధైర్యాన్ని నూరిపోసేలా ఉందనే ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి 100 మంది తల్లిదండ్రులలో 80 శాతం మంది తమ పిల్లలకు రక్షణ గురించి నేర్పించే విధానంలో ఇరుముడి ఒక కొత్త ఆలోచనని  రేకెత్తిస్తోంది. అందుకే అంటారు సినిమా ఆదిపరాశక్తితో సమానమని .

Irumudi, Raviteja, Tollywood

 



 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.