![]() |
![]() |

ఇరుముడి.. ఇప్పుడు ఏ ముగ్గురు కలిసినా ఇరుముడి చూసావా లేదా అని డిస్కర్షన్ చేసుకుంటున్నారంటే ఇరుముడి ఆధిపత్యాన్ని అర్ధం చేసుకోవచ్చు. మాస్ మహారాజా రవితేజతో పాటు కూతురు మణికంఠ(మణమ్మ) గా చేసిన చిన్నారి నక్షత్ర తన అద్భుతమైన అభినయంతో అందరి దృష్టినీ ఆకరిస్తుంది. మొదటి సినిమాతోనే లీడ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించి, అమాయకత్వంతో కూడిన నటన, ముచ్చటైన సంభాషణలు, తండ్రి-కూతుళ్ల మధ్యన ఉండే అపురూపమైన అనుబంధాన్ని పండించిన తీరు విమర్శకుల నుండి సైతం ప్రశంసలు అందుకుంది. 'ఒక రకంగా ఇరుముడి కథ నక్షత్ర లక్ష్య సాధన కోసమే పుట్టింది.
క్లైమాక్స్ సన్నివేశాల్లో ఆమె నటన చూసి ప్రేక్షకులు కంటతడి పెట్టుకుంటూ థియేటర్స్ నుంచి వస్తున్నారంటే నక్షత్ర సృష్టించిన 'ఆరా' ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. అంతటి గొప్ప పెర్ ఫార్మెన్స్ ని కనబరిచిన నక్షత్ర రియల్ లైఫ్ బ్యాక్‌గ్రౌండ్ ఇప్పుడు అందరినీ మరింత భావోద్వేగానికి గురిచేస్తున్నాయి. నిజ జీవితంలో నక్షత్రకు చిన్నతనంలోనే తండ్రి లేరనే చేదు నిజం చాలామందిని కలిచివేస్తోంది. ఆమె చిన్నతనంలోనే తండ్రి దూరమవ్వడంతో, తల్లి అన్ని తానై ఎంతో క్రమశిక్షణతో పెంచి పెద్ద చేసింది. సొంత తండ్రి ప్రేమకు దూరమైన నక్షత్ర, తెరపై రవితేజ సరసన కూతురిగా నటిస్తున్నప్పుడు తనలో దాగున్న నిజమైన తండ్రి ప్రేమను, ఆ వెలితిని తీర్చుకుందని నిన్న జరిగిన సక్సెస్ మీట్ లో దర్శకుడు శివ నిర్వాణ భావోద్వేగంతో వెల్లడి చేసాడు.
సినిమా షూటింగ్ సమయంలో 45 రోజుల పాటు సాగిన సుదీర్ఘమైన షెడ్యూల్‌లో నక్షత్ర ప్రదర్శించిన ప్రతిభ, సమయపాలన యూనిట్ సభ్యులందరినీ ఆశ్చర్యపరిచింది. తండ్రి లేని లోటును తన గుండెల్లో దాచుకుని, తెరపై తండ్రి-కూతుళ్ల అనుబంధాన్ని అంత సహజంగా పండించడం సామాన్యమైన విషయం కాదు. నక్షత్ర నేపథ్యం తెలిసిన తర్వాత ప్రేక్షకులు ఆమెపై మరింత ప్రేమాభిమానాలను కురిపిస్తున్నారు. ప్రతిభకు పేదరికం గానీ, జీవితంలో ఎదురయ్యే విషాదాలు గానీ అడ్డంకి కావు అని నక్షత్ర నిరూపించింది. ఒక్కటి మాత్రం నిజం ఏంటంటే పై లోకంలో ఉన్న నక్షత్ర తండ్రి తన కూతురు విజయాన్ని చూసి గర్వపడుతూ ఉంటాడు. ఒక వేళ ఆయన మళ్ళీ పుట్టి ఉంటే తల్లి ఒడిలో పసివాడుగా ఇరుముడి థియేటర్ కి వెళ్లి తన కూతురు పెర్ఫార్మ్ చూసి ఉండవచ్చు.
ఇక ఇరుముడి తన ప్రభంజనాన్ని చాలా స్పష్టంగా కొనసాగిస్తు బాక్స్ ఆఫీస్ వద్ద తన అజమాయిషీ చెలాయిస్తూ ఉంది. మూడు రోజులకే 80 కోట్ల క్లబ్ లో చేరడంతో వంద రోజుల పోస్టర్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. హైదరాబాద్ మియాపూర్ లోని మిరాజ్ థియేటర్ లో 'మల్లెపూల పల్లకి' సాంగ్ ని సెకండ్ టైం ప్లే చేయించి భారీ లైటింగ్ మధ్య స్క్రీన్ ముందు ప్రేక్షకులు డాన్స్ లు వెయ్యడం ఇరుముడి ఉదృతి యొక్క స్థాయికి స్పష్టమైన సంకేతం. నక్షత్ర ది కేరళ లోని కన్నూర్. తన నెలల వయసప్పుడే తండ్రి చనిపోయాడు. ప్రెజెంట్ సెవెంత్ క్లాస్.
Irumudi, Nakshathra, Raviteja, Shiva Nirvana
![]() |
![]() |