Home  »  News  »  కృతి సనన్ రక్షాబంధన్ వివాదం

Updated : Aug 24, 2026

 

సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన 1 నేనొక్కడినే మూవీతో జతకట్టి  తెలుగు ప్రేక్షకులని పలకరించిన  కృతిసనన్ ఇప్పుడు బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ రేంజ్ లో దూసుకెళ్తుంది. రీసెంట్ గా కాక్ టెయిల్ 2 తో అలరించిన కృతి  ఈ నెల 28 న రాబోతున్న రక్షాబంధన్ పండుగని పురస్కరించుకొని చేసిన యాడ్ వివాదంగా మారింది.


ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ 'గివా' (GIVA) తమ రక్షాబంధన్ మరియు పెట్ కలెక్షన్ ప్రమోషన్ లో భాగంగా ఈ కమర్షియల్ యాడ్‌ను రూపొందించింది. ఈ ప్రకటనలో కృతి  ఆఫ్ వైట్ రంగులో ఉన్న బ్రాలెట్ స్టైల్ బ్లౌజ్, దానిపై ష్రగ్ (కేప్) మరియు డ్రేప్డ్ స్కర్ట్‌తో కూడిన మోడ్రన్ ఇండో-వెస్ట్రన్ లుక్‌లో కనిపించారు. పవిత్రమైన రక్షాబంధన్ పండుగ వేళ, సొంత సోదరుడికి రాఖీ కట్టే సమయంలో ఇలాంటి బోల్డ్ బ్రాలెట్ దుస్తులు ధరించడం సంప్రదాయాలకి విరుద్ధం. రాఖీ కట్టేటప్పుడు కనీసం పూజా పళ్లెం, తిలకం, పసుపు కుంకుమ వంటి ప్రాథమిక సాంప్రదాయ అంశాలు కనిపించకపోవడంపై కూడా నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. సంప్రదాయ వేడుకల పవిత్రతను ఈ ప్రకటన తగ్గించేలా ఉందంటూ నెటిజన్లలో ఒక వర్గం మండిపడుతోంది. 

Also Read: హయ్యస్ట్ టికెట్ రేట్ ఇదే


వివాదానికి తోడైన మరో కీలకమైన అంశం ఏమిటంటే.. ఈ యాడ్‌లో కృతి సనన్ తన సోదరుడికి రాఖీ కట్టిన తర్వాత, కుటుంబ సభ్యుడిగా భావిస్తూ తమ పెంపుడు కుక్కకు కూడా రాఖీ కడుతుంది. జ్యువెలరీ బ్రాండ్ తమ పెట్ రాఖీ సేకరణను ప్రమోట్ చేయడానికి ఈ కాన్సెప్ట్ ఎంచుకున్నప్పటికీ, పెంపుడు జంతువులకు రాఖీ కట్టడాన్ని పండుగ మూల భావనను అపహాస్యం చేయడమేనంటూ ట్రోలర్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. 

Kriti Sanon, Raksha Bandhan






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.