![]() |
![]() |

మాటని అప్ డేట్ చేసి సినీ ప్రియుల్ని తన మాయలో పాడేసుకున్న మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్. మాటని వయ్యారంగా ముస్తాబు చేయవచ్చని కూడా నిరూపించాడు ప్రస్తుతం వెంకటేష్ తో ఆదర్శ కుటుంబం తెరకెక్కిస్తున్నాడు. ఆ తర్వాత మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో గాడ్ ఆఫ్ వార్ ని లైన్ లోకి తీసుకొస్తాడు. ఈ రెండు చిత్రాలని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పై సూర్యదేవర చినబాబు నిర్మిస్తున్నాడు. ఈ బ్యానర్ నుంచి వచ్చిన ఫస్ట్ మూవీ అల్లు అర్జున్ వన్ మాన్ షో జులాయి. దర్శకుడు త్రివిక్రమ్ నే. ఈ జులాయి నుంచి ప్రెజెంట్ త్రివిక్రమ్ చేస్తున్న సినిమాల దాకా అన్ని కూడా
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నే నిర్మాణ సంస్థ. అంటే ఆ సంస్థ తెరకెక్కించిన అన్ని చిత్రాలు త్రివిక్రమ్ తోనే.
ఈ విధంగా ఒకే బ్యానర్‌లో వరుసగా సినిమాలు చేసే దర్శకులు లేదా నటులను చూసినప్పుడు, వారి మధ్య ఏదో ఒక కాంట్రాక్ట్ లేదా అగ్రిమెంట్ ఉందేమో అని సినీ ప్రియులు భావించడం సహజం. అయితే, ప్రస్తుత రోజుల్లో అలాంటి పరిస్థితి లేదని, నిజమైన ఆత్మీయ అనుబంధం ఉంటే ఎలాంటి అగ్రిమెంట్లు అవసరం లేదని స్పష్టం చేశారు ప్రముఖ నిర్మాత, సీతార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ. ఈ నాగ వంశీ ఎవరో కాదు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ చినబాబు సోదరుడి కుమారుడు. త్రివిక్రమ్ తో తమ కుటుంబానికి, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థకు ఉన్న సుదీర్ఘమైన బంధం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. నాగవంశీ మాట్లాడుతూ 'బాబాయ్ ఇండస్ట్రీకి వస్తున్న సమయంలో, తన మొదటి సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలోనే చేయాలని గట్టిగా కోరుకున్నారు. త్రివిక్రమ్‌కు ఉన్న అద్భుతమైన పనితీరు, సినిమాల పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమ, కథా కథనాలపై ఉన్న పట్టు వల్లే ఆ నిర్ణయం తీసుకున్నారు. అలా వీరిద్దరి కాంబినేషన్‌లో ప్రారంభమైన మొదటి చిత్రం నుంచే త్రివిక్రమ్‌తో తమ కుటుంబానికి ఉన్న బంధం మరింత బలపడుతూ వచ్చింది. కేవలం ఒక దర్శకుడు, నిర్మాతగా కాకుండా వారి సంబంధం ఒక ఆత్మీయ కుటుంబ అనుబంధంగా రూపాంతరం చెందింది. చిత్ర పరిశ్రమలో తమ నిర్మించబోయే బ్యానర్‌కు ఏం పేరు పెట్టాలా అని ఆలోచిస్తున్న సమయంలో త్రివిక్రమ్ అందించిన సహకారం మరవలేనిది.
Also read: వీసా రిజెక్ట్.. మోహన్ లాల్ తీవ్ర ఆవేదన
'హారిక అండ్ హాసిని క్రియేషన్స్' అనే పేరుని స్వయంగా త్రివిక్రమ్ శ్రీనివాసే సూచించారు. అంతేకాకుండా, ఆ బ్యానర్ యొక్క లోగోను సైతం త్రివిక్రమే ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఆ బ్యానర్ పునాదుల నుంచి ప్రతి అడుగులోనూ త్రివిక్రమ్ భాగస్వామ్యం ఉంది. అప్పటి నుండి నేటివరకు త్రివిక్రమ్ ఇతర బయటి బ్యానర్లలో సినిమాలు చేసేందుకు పెద్దగా మొగ్గు చూపలేదు. ఈ ప్రయాణంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫోర్చ్యూన్ ఫోర్ సినిమాస్ వంటి బ్యానర్లు కూడా తోడై ఎన్నో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాయి. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే, 'జులై' చిత్రం నుంచి నేటి వరకు త్రివిక్రమ్ వారి బ్యానర్‌లోనే వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ, వీరి మధ్య ఒక్క కాగితంపై కూడా అగ్రిమెంట్ లేదా లీగల్ బాండ్ సంతకం చేయలేదట. సినిమా ఇండస్ట్రీలో కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నప్పటికీ, విశ్వాసం మరియు కుటుంబ తరహా అనుబంధమే తమను నడిపిస్తోందని నాగవంశీ తెలిపారు.
TriVikram, Naga vamsi, Haarika Hassine Creations, Radhakrishna
.webp)
![]() |
![]() |