Home  »  News  »  వీకెండ్ ఓటీటీ హంగామా: ఈ వారం మిస్ అవ్వకూడని కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.!

Updated : Aug 8, 2026

ఈ వీకెండ్‌లో ఓటీటీ ప్రియులకు వినోదాల పంట పండిందనే చెప్పాలి. అక్కినేని అఖిల్ 'లెనిన్', సిద్ధార్థ్ 'ఆపరేషన్ సఫేద్ సాగర్', తిరువీర్ 'ఓ సుకుమారి'తో పాటు.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5, జియో హాట్‌స్టార్ వంటి ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో 25కు పైగా సినిమాలు, సిరీస్‌లు సందడి చేస్తున్నాయి. యాక్షన్, డ్రామా, రొమాన్స్, సస్పెన్స్, పీరియాడికల్, రూరల్ ఇలా పలు జానర్స్ లో ప్రతి ఒక్కరి అభిరుచికి తగ్గట్టుగా వినోదాలు అలరిస్తున్నాయి.

ఈ వారం ఓటీటీ రిలీజ్‌లలో ప్రధానంగా ఆకట్టుకుంటున్న చిత్రాల్లో అక్కినేని అఖిల్ హీరోగా నటించిన తాజా బ్లాక్‌బస్టర్ యాక్షన్ మూవీ 'లెనిన్' ముందువరుసలో ఉంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరు తెరకెక్కించారు. థియేటర్లలో సంచలనం సృష్టించిన ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసిన నెల రోజుల్లోపే ప్రముఖ డిజిటల్ సంస్థ జీ5 వేదికగా డిజిటల్ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చి విశేషంగా ఆకట్టుకుంటోంది. 

వైవిధ్యమైన పాత్రలతో మెప్పించే తమిళ హీరో విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో దర్శకుడు శశి కాంబినేషన్‌లో వచ్చిన ఫ్యామిలీ డ్రామా 'వంద దేవుళ్ళు' కూడా జీ5లో స్ట్రీమింగ్ అవుతూ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఎంతగానో అలరిస్తోంది. ఇందులో శ్వాసిక, అజయ్, కావ్య, శక్తి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

మరోవైపు నెట్‌ఫ్లిక్స్ వేదికపై సైనిక నేపథ్యం, దేశభక్తి అంశాలతో భారీ స్థాయిలో రూపుదిద్దుకున్న 'ఆపరేషన్ సఫేద్ సాగర్' వార్ యాక్షన్ వెబ్‌సిరీస్ విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో ఓనీ సేన్ దర్శకత్వంలో తీర్చిదిద్దిన ఈ సిరీస్ హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉండి రికార్డు వ్యూస్ తో ముందుకు సాగుతోంది. 

అలాగే నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ చిత్రం 'మై వాపస్ ఆవూంగా', హాలీవుడ్ అడ్వెంచర్ 'ది సూపర్ మారియో గెలాక్సీ', 'ది లాస్ట్ హౌస్', 'బిగ్ చికెన్: ఎ ఫాస్ట్ ఫుడ్ కాన్స్పిరసీ', 'లవ్ హర్ట్స్'తో పాటు.. తమిళ్, తెలుగు భాషల్లో వచ్చిన 'హృదయం మురళి', కొరియన్ డ్రామా 'అవర్ స్క్రిక్ట్లీ లవ్' వంటి సినిమాలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి.

అమెజాన్ ప్రైమ్ వీడియో విషయానికి వస్తే, విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన రూరల్ కామెడీ డ్రామా 'ఓ సుకుమారి' ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా భరత్ దర్శన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా, తాకగానే షాక్ కొట్టే విచిత్రమైన శక్తి ఉన్న ఒక అమ్మాయి చుట్టూ తిరిగే వినూత్న కథాంశంతో డిజిటల్ వీక్షకులకు నవ్వులు పంచుతోంది. 

ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చిన ఇతర చిత్రాల్లో 'ఎంఆర్‌పీ: నీకెంత నాకెంత', ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'డార్క్ సీక్రెట్', ప్రముఖ హిందీ సిరీస్ సీక్వెల్ 'వదంతి: సీజన్ 2', అలాగే ఇంగ్లీష్, తెలుగు వర్షన్లలో అందుబాటులో ఉన్న 'స్టెర్లింగ్ పాయింట్: సీజన్ 1' కూడా ఓటీటీ ప్రియులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

ఇవే కాకుండా జియో హాట్‌స్టార్‌లో మలయాళ, తెలుగు వర్షన్లలో సైకలాజికల్ థ్రిల్లర్ 'ఉయిర్', సింప్లీసౌత్‌లో తమిళ చిత్రం 'కాట్టలాన్' వంటి విభిన్న చిత్రాలు సైతం తమ మార్కు వినోదాన్ని అందిస్తున్నాయి.

ఇలా దాదాపు 25 సినిమాలు, వెబ్‌సిరీస్‌లు విభిన్న ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో అలరిస్తుండటంతో, ఈ వీకెండ్ సినీ ప్రియులకు సరికొత్త వినోదాల వేడుకగా మారింది.

 

 

 

Telugu OTT Releases, Lenin Movie, Oh Sukumari, Vanda Devullu, Hrudhayam Murali 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.