Home  »  News  »  ఇదేనా!.. రాజకీయాల్లోకి వచ్చే సినీ లిస్ట్ 

Updated : Aug 8, 2026

 


పాలిటిక్స్ vs సినిమాకి ఉన్న మధ్య అనుబంధం ఫెవికాల్ కంటే చాలా స్ట్రాంగ్. ఈ విషయం 
నిజమని  లాంగ్ ఎగో, లాంగ్ ఎగో  నుంచి నేటి జెన్ జీ బ్యాచ్ వరకు ఒప్పుకుంటారు. ఒప్పుకోవడమే కాదు సినిమాకి ఎట్ ఏ టైం రాజకీయాల్లో చక్రం తిప్పే శక్తీ ఉందంటూ సినిమా గొప్పతనం గురించి చెప్పడం ప్రారంభిస్తారు. 


ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత కాలం నుంచి నేటి తరం కథానాయకుల వరకు, గ్లామర్ ప్రపంచం నుంచి రాజకీయ సమరాంగణంలోకి అడుగుపెట్టడం ఒక బలమైన సాంప్రదాయంగా మారింది. పవన్ కళ్యాణ్  70,000 పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో గెలుపొంది, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్రస్థానం దేశమంతటా సంచలనం సృష్టించింది. 2014లో పార్టీని స్థాపించి, సుదీర్ఘ కాలం ప్రజా సమస్యలపై పోరాడిన పవన్ కల్యాణ్, 2024 శాసనసభ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేసి 100 శాతం స్ట్రైక్ రేట్‌తో అన్ని స్థానాలని  కైవసం చేసుకుని చరిత్ర పుటల్లో నిలిచారు.  ఈ క్రమంలోనే తమిళ చిత్రసీమలో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న దళపతి విజయ్ సైతం అదే రాజకీయ బాటపట్టారు. తమిళగ వెట్రి కళగం (TVK) పేరిట నూతన రాజకీయ రథాన్ని అధిరోహించిన విజయ్, తన సినీ రంగానికి స్వస్తి చెప్పి పూర్తిస్థాయి ప్రజా సేవకు అంకితమవుతానని ప్రకటించారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో సోలోగా నిలిచి 108 స్థానాలను సొంతం చేసుకుని అధికారం చేజిక్కించుకోవడంతో దక్షిణాది రాజకీయాల్లో మరో పెద్ద మార్పు చోటుచేసుకుంది. రీల్ హీరోలు రియల్ లీడర్లుగా మారుతున్న ఈ క్రమం సినీ అభిమానులను, సామాన్య ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. 

Also read: సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద విషాదం. ఆ కారణంతో పోలీస్ కానిస్టేబుల్ మృతి 

పవన్ కల్యాణ్ సాధించిన విజయాలు, విజయ్ సృష్టించిన ప్రభంజనం కొంత మంది హీరోలకి స్పూర్తిగా నిలుస్తున్నాయి.  ఇదే ఊపులో కోలీవుడ్, టాలీవుడ్‌కి చెందిన బడా హీరోల పేర్లు వినిపిస్తున్నాయి.  ప్రజాదరణ, ఫ్యాన్ బేస్, సామాజిక మార్పు పై ఉన్న ఆకాంక్ష కలగలసి ఈ నటులను ప్రజాక్షేత్రంలోకి వచ్చేలా చేస్తున్నాయనేది టాక్ . వెండితెరపై బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసిన స్టార్ పవర్, ఇప్పుడు ప్రజా సంక్షేమ పథకాలు మరియు పారదర్శక పాలన అందించే దిశగా తమ అడుగులు వెయ్యడం శుభసూచికం. రాబోయే రోజుల్లో ఏ హీరో పేరు వింటానా అని సోషల్ మీడియా ఎగైటింగ్ గా వెయిట్ చేస్తూ ఉంది. ఏది ఏమైనా దక్షిణాది ప్రజాస్వామ్యంలో ఈ గ్లామర్ వర్సెస్ పొలిటికల్ చాప్టర్ సరికొత్త మలుపులు తిరగడం ఖాయం.

Ntr, Pawn Kalyan, Vijay, MGR






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.