![]() |
![]() |

ఎటువంటి కల్మషం లేని స్వచ్ఛమైన ప్రేమకి నిర్వచనం చెప్పిన మూవీ 'చెన్నై లవ్ స్టోరీ'. ప్రేమ,ప్రేమించిన వారి సుఖమే కోరుకుంటుందనే పాయింట్ అయితే ఆడియెన్స్ కి బాగానే కనెక్ట్ అవుతుంది. క్లీన్ లవ్ స్టోరీగా నిలవడంతో ఫ్యామిలీస్ కూడా థియేటర్స్ బాట పడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో చిత్ర దర్శకుడు నంబూరి రవి ఎవరనే చర్చ జరుగుతుంది.
రవి నంబూరి 2008లో ఈసీఈ విభాగంలో బి.టెక్ పూర్తి చేసిన అనంతరం దాదాపు 4 సంవత్సరాల పాటు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కార్పొరేట్ ఉద్యోగం చేశారు. అయితే, చిన్నతనం నుంచే పవన్ కళ్యాణ్ సినిమాలపైనా, వెండితెరపైనా ఉన్న అమితమైన ఇష్టంతో తనఉద్యోగానికి స్వస్తి చెప్పి, పరిశ్రమ వైపు అడుగులు వేశారు. సినీ ప్రయాణంలో తొలి రోజుల్లో 2015లో 'భలే భలే మగాడివోయ్' షూటింగ్ సమయంలో దర్శకుడు మారుతితో ఏర్పడిన పరిచయంతో రవి స్క్రిప్ట్ రైటింగ్‌పై పూర్తి దృష్టి సారించారు. 'బ్రదర్ ఆఫ్ బొమ్మాలి', 'రోజులు మారాయి', 'ఉర్వశివో రాక్షసివో', 'భలే మంచి చౌక బేరం' వంటి చిత్రాలకు రైటర్‌గా, అసోసియేట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించి మంచి అనుభవం సంపాదించారు.
అనంతరం 'బేబి' సినిమా సమయంలో దర్శకుడు సాయి రాజేష్‌తో ఏర్పడిన అనుబంధం కెరీర్‌ని మలుపు తిప్పింది. సాయి రాజేష్ అందించిన ప్రత్యేకమైన కథను నిర్మాత ఎస్‌కేఎన్ సహాయంతో డైరెక్షన్ చేసే గొప్ప అవకాశాన్ని రవి దక్కించుకున్నాడు.
Ravi Namburi, Chennai Love Story Director, Kiran Abbavaram, Sri Gouri Priya, Sai Rajesh

![]() |
![]() |