![]() |
![]() |

అనంతపురం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు, గుత్తి పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు సురేష్ పాటిల్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలుసుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వెంటనే స్పందించారు.
తన తల్లి పద్మజ సహకారంతో హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్ వైద్యులతో మాట్లాడించి, సురేష్ పాటిల్ కి అత్యుత్తమ వైద్యం అందేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆపరేషన్ విజయవంతంగా జరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడమే కాకుండా, చికిత్స సమయంలో ఆయనకు, కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆసుపత్రిలో అవసరమైన అన్ని ఏర్పాట్లను సమకూర్చారు.
అంతేకాకుండా, చికిత్సకు అయ్యే పూర్తి వైద్య ఖర్చును స్వయంగా ఆయనే భరించి, సురేష్ పాటిల్ పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యే వరకు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ అండగా నిలిచారు.
అభిమానులకు అండగా ఉండటంలో వరుణ్ తేజ్ కి ఇది కొత్త విషయం కాదు. ఇటీవల అనంతపురానికి చెందిన ఓ అభిమాని మరణించగా, ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు.
Varun Tej, Chiranjeevi, Pawan Kalyan, Janasena
![]() |
![]() |