![]() |
![]() |

ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 నుంచి సరికొత్త యానిమేటెడ్ సిరీస్ ‘శివలోక్ కె కుండక్క మండక్క’ (SKM) వస్తోంది. ప్రముఖ రచయిత ఆనంద్ నీలకంఠన్ రాసిన అత్యధికంగా అమ్ముడైన పిల్లల పుస్తకం ‘ ది వెరీ ఎక్స్‌ట్రీమ్లీ, మోస్ట్ నాటీ అసుర టేల్స్ ఫర్ కిడ్స్’ ఆధారంగా ఈ సిరీస్ రూపొందింది. ఇది జూలై 17 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. మన అందరికీ తెలిసిన పౌరాణిక ప్రపంచాన్ని ఈ యానిమేటెడ్ సిరీస్ ద్వారా స్క్రీన్‌పై సరికొత్తగా అందించనున్నారు.
కథ విషయానికి వస్తే.. కుండక్క, మండక్క అనే ఇద్దరు అల్లరి అసుర జంట చుట్టూ తిరుగుతుంది. వాళ్ల అల్లరి పనులు ధైర్యం, స్నేహం, తమను తాము తెలుసుకునే ఒక అద్భుతమైన అడ్వెంచర్‌లోకి తీసుకెళ్తాయి. రామాయణం, మహాభారతం వంటి తెలిసిన కథలకే పరిమితం కాకుండా, ఈ సిరీస్ భారతీయ పౌరాణిక సంపదలోని కొత్త పాత్రలు, ఇంకా అన్వేషించని లోకాలు, మాయాజాలంతో నిండిన అడ్వెంచర్లను పిల్లలకు, కుటుంబాలకు పరిచయం చేయనుంది.
వినోదం, యాక్షన్, ఆకర్షణీయమైన యానిమేషన్ కలయికతో రూపొందిన ఈ సిరీస్ నేటి పిల్లల కోసం పౌరాణిక కథలను సరికొత్తగా ఆవిష్కరించనుంది. హీరో అనే పదం ఓ వ్యక్తి తను తీసుకునే నిర్ణయాలతో నిర్ణయించబడుతాడనే అభిప్రాయాన్ని అందంగా అందరికీ తెలియజేస్తుంది. ఇదొక పెద్ద యూనివర్స్‌కు ఆరంభం మాత్రమే. ‘శివలోక్ కె కుండక్క మండక్క’ భవిష్యత్తులో కొత్త పాత్రలు, కొత్త అడ్వెంచర్లు, మరిన్ని కథలతో విస్తరించే ప్రపంచానికి పునాది వేస్తుంది.
‘శివలోక్ కె కుండక్క మండక్క’ సిరీస్ హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులోకి రానుంది.
Shivlok Ke Kundakka Mandakka, Mythical Animation Series, ZEE5
![]() |
![]() |