Home  »  News  »  జననాయగన్ ఫస్ట్ రివ్యూ!

Updated : Jul 16, 2026

 

తమిళ చిత్ర పరిశ్రమతో పాటు యావత్ భారత సినీ ప్రపంచం ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ 'జననాయగన్'(Jana Nayagan). ఎలక్షన్స్ కి ముందు జరిగిన మూవీ, విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వస్తుండటంతో ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో చెప్పక్కర్లేదు. పైగా విజయ్ ఆఖరి మూవీ.  


ఈ నేపథ్యంలో జన నాయగన్ ఫస్ట్ రివ్యూ నెట్టింట ట్రెండ్ అవుతోంది. హాలీవుడ్ స్థాయి పొలిటికల్ యాక్షన్ డ్రామాగా దీనిని తీర్చిదిద్దారని, విజయ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని, తెరపై ఆయన నటన చూస్తున్నంత సేపు ప్రేక్షకులు తమ చూపుని పక్కకి తిప్పుకోలేని విధంగా లీనమైపోతారని, ప్రధానంగా పొలిటికల్ టచ్ ఉన్న సీన్స్, లెజెండరీ నటుడు ఎంజీఆర్ (MGR) కి సంబంధించిన అద్భుతమైన రిఫరెన్స్‌లు ఉంటాయని, విజయ్ స్వయంగా పాడిన 'నాన్ అనైయిటాల్' పాట థియేటర్లను ఊపేస్తుందని రివ్యూవర్స్ చెబుతున్నారు. థియేటర్ ఫైర్ యాక్సిడెంట్ సీక్వెన్స్ ప్రేక్షకులకి  రోమాంచితమైన థ్రిల్ ని ఇస్తుందని పేర్కొంటున్నారు. పూజా హెగ్డే, మమితా బైజు, ప్రియమణి వంటి భారీ తారాగణం ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ముఖ్యంగా 'తలపతి కచేరి' పాట ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. విజయ్ సినీ ప్రస్థానానికి ముగింపుగా వస్తున్న 'జననాయగన్' బాక్సాఫీస్ వద్ద నూతన రికార్డులని సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

also read: ఆ అరుగురితోనే అఖిల్ పోటీ.. మరి లెనిన్ పరిస్థితి ఏంటి!

దర్శకుడు హెచ్. వినోద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ చిత్రం, తెలుగు విజయవంతమైన సినిమా 'భగవంత్ కేసరి' కి రీమేక్ అనే రూమర్స్ గట్టిగా వినిపించినప్పటికీ, సినిమాలో కేవలం కొన్ని కీలక ఎమోషనల్ పాయింట్స్ మాత్రమే తీసుకుని, మిగిలిన కథ మొత్తాన్ని వెస్ట్రన్ శైలిలో అద్భుతమైన రాజకీయ డ్రామాగా మార్చేశారని స్పష్టమవుతోంది. మాజీ పోలీస్ ఆఫీసర్ వెట్రి కొండన్‌ పాత్రలో విజయ్ గంభీరమైన నటన కనబరిచారని సమాచారం. విలన్ గా  బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ చూపించిన విశ్వరూపానికి, విజయ్ ఇచ్చే కౌంటర్లు థియేటర్లలో విజిల్స్ వేయిస్తాయని తెలుస్తోంది. ఈ చిత్రం సెన్సార్ పరంగా అనేక ఒడిదుడుకులు, సుదీర్ఘ కోర్టు వివాదాలు, ఆన్‌లైన్ లీక్ వంటి సమస్యలను ఎదుర్కొని చివరకు 'A' సర్టిఫికేట్‌తో జూలై 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.నిడివి 3 గంటల 3 నిమిషాల 52 సెకన్లు.

vijay, jana nayagan, pooja hegde, mamitha baiju






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.