![]() |
![]() |

'అ' అంటే అక్కినేని అనే నిజాన్ని మరోసారి సినీ ప్రపంచానికి చాటి చెప్తూ లెనిన్(Lenin)తో దూసుకుపోతున్నాడు అఖిల్(Akhil). మరీ ముఖ్యంగా అభిమానులు అయితే అఖిల్ బ్లాక్ బస్టర్ ని అందుకోవడంతో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ క్రమంలోనే అఖిల్ ఫస్ట్ టైం లెనిన్ తో వంద కోట్ల క్లబ్ లోకి చేరే గడియ కోసం అభిమానులు ఎంతో ఉద్వేగంగా వెయిట్ చేస్తున్నారు.
అయితే ఈ వీకెండ్ లెనిన్ ముందు పెద్ద సవాళ్లే ఎదురుకాబోతున్నాయి. ఒకేసారి థియేటర్లలోకి 'మిస్టర్ మిడిల్ క్లాస్', 'ఓ సుకుమారి', 'వదలా', 'ఆపరేషన్ అరుణారెడ్డి', 'ఎంఆర్పీ', 'రాజా ది రాజా' వంటి ఆరు సినిమాలు ఈ శుక్రవారం నుంచి సందడి చేయనున్నాయి. సీనియర్ నటులు శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, లయ ముఖ్య పాత్రల్లో నటించిన 'మిస్టర్ మిడిల్ క్లాస్' సినిమా తారాగణం పరంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. 'ఓ సుకుమారి' కూడా ఓ మోస్తరు అంచనాలతో థియేటర్లలోకి వస్తోంది. మిగతా చిత్రాలకు పెద్దగా బజ్ లేనప్పటికీ, థియేటర్ల షేరింగ్‌లో ఇవి ప్రభావం చూపే అవకాశం ఉంది.
Also read: ఒక్క టిప్‌తో వెయిటర్ జీవితాన్ని మార్చిన టైటానిక్ హీరో.. ఆ మొత్తం ఎంతో తెలుసా!
ఈ ఆరు సినిమాల కంటే ఎక్కువగా, ఇంగ్లీష్ సినిమా 'ది ఒడిస్సీ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. ఇది కచ్చితంగా 'లెనిన్' వసూళ్లపై ప్రభావం చూపిస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బుధవారం 28 శాతం డ్రాప్ తర్వాత, గురువారం కూడా థియేటర్లలో ఆక్యుపెన్సీ ఆశించిన స్థాయిలో చూపించడం లేదు. మరి ఈ అరడజను కొత్త సినిమాల పోటీని తట్టుకుని అఖిల్ 'లెనిన్' బాక్సాఫీస్ వీకెండ్ రేసులో ఎంతవరకు నిలబడుతుందో వేచి చూడాలి. ఒక్కటి మాత్రం నిజం 'లెనిన్' వంద కోట్ల మార్కుని చేరుకోవాలంటే ఈ వీకెండ్ ప్రేక్షకులు థియేటర్లకి క్యూ కట్టాల్సిందే.
akhil, lenin, srikanth, rajendraprasad, thiruveer
![]() |
![]() |