![]() |
![]() |

మడిసన్నాక కాస్తంత కళాపోషణ ఉండాలనేది ఎంత నిజమో, ఎలక్షన్స్ అన్నాక రెండు, మూడు చెదురు మదురు సంఘటనలు జరగడం అనేది అంతే నిజం. ఆ మాట కొస్తే ఎలక్షన్స్ అన్నాక గొడవలు జరగకపోతే నాకు ఇచ్చే వాల్యూ ఇదేనా అని ఎలక్షన్స్ నే బుంగమూతీ పెట్టుకునే పరిస్థితి. ఏది ఏమైనా నిన్న జరిగిన తమిళనాడు ఎలక్షన్స్ ప్రశాంతంగా ముగిసాయి. సినీ రంగం నుంచి ఇళయ దళపతి విజయ్ పోటీ చెయ్యడంతో సినీ తారలు పెద్ద ఎత్తున బూత్ ల దగ్గర బారులు తీరారు. వాళ్లలో త్రిష(Trisha)ఒకరు. ఆమె ఎవరకి ఓటేసి ఉంటారో ప్రతేక్యంగా చెప్పుకోవాల్సిన పని లేదు.
త్రిష రీసెంట్ గా, అంటే ఎలక్షన్స్ అయిన వెంటనే తన ఇన్ స్టాగ్రామ్ లో విజయ్(Vijay)తో కలిసి చేసిన 'గిల్లీ'(Gilli)సినిమాలోని 'అర్జునార్ విల్లు' అనే పాటని ఇన్స్టా స్టోరీగా ఉంచింది. అర్జునార్ విల్లు అంటే తెలుగులో అర్జునుడి విల్లు అని అర్ధం. దీంతో ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఫ్యాన్స్ అయితే విజయ్ గెలిచినట్టుగానే త్రిష చెప్పిందని సంబరాల్లో మునిగిపోయారు. మహాభారతంలో యోధులుగా ఉన్న పాండవులలో మూడవవాడు అర్జునుడు.గొప్ప విలుకాడు అని ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పని లేదు. అర్జునుడు ఉపయోగించే విల్లు పేరు 'గాండీవం'. ఇది చాలా శక్తివంతమైనది,దైవికమైనది. అందుకే ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు.
also read: Pawan Kalyan: వరల్డ్ వైడ్ గా ఉస్తాద్ భగత్ సింగ్ ప్రభంజనం.. అసలు నిజం లేటుగా బయటకి
ఇక ఇదే సాంగ్ మహేష్ బాబు(Mahesh Babu)భూమికతో ఒక్కడులో 'సాహసం శ్వాసగా సాగిపో' అనే లిరిక్స్ తో వచ్చింది. ఒక్కడునే గిల్లిగా రీమేక్ చేసారు. విజయ్, త్రిష కెరీర్ లోనే ఒక మైల్ స్టోన్ మూవీగా నిలిచింది.

![]() |
![]() |