![]() |
![]() |

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ 'డార్లింగ్' (Darling) నేడు మళ్ళీ థియేటర్లలోకి అడుగుపెట్టింది. సుమారు 16 ఏళ్ల తర్వాత మళ్లీ విడుదలైనప్పటికీ, ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని స్పష్టమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ లభించాయి. (Darling Re Release)
హైదరాబాద్‌లోని ప్రధాన థియేటర్లతో పాటు మల్టీప్లెక్స్‌లలో కూడా 'డార్లింగ్' షోలు హౌస్‌ఫుల్ అవుతున్నాయి. ఉదయం షోల నుండే ఫ్యాన్స్ థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. కేవలం అభిమానులే కాకుండా, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాను మళ్లీ వెండితెరపై చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా కూడా 'డార్లింగ్', రీ-రిలీజ్ సినిమాల్లో సరికొత్త రికార్డులను నెలకొల్పింది.
సినిమాలోని ఒక్కో పాటకూ, డైలాగ్‌కూ అభిమానులు పేపర్లు చల్లుతూ, డాన్సులు చేస్తూ థియేటర్లను హోరెత్తిస్తున్నారు. ప్రభాస్, కాజల్ అగర్వాల్ మధ్య కెమిస్ట్రీని, కరుణాకరణ్ మార్క్ ఫీల్ గుడ్ సీన్స్‌ని మళ్లీ పెద్ద తెరపై చూస్తుంటే పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో #Darling4K హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది.
ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం, 'డార్లింగ్' రీ-రిలీజ్ మొదటి రోజు వసూళ్లు అనేక చిన్న సినిమాల ఫుల్ రన్ కలెక్షన్ల కంటే ఎక్కువగా ఉండబోతున్నాయని సమాచారం. అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే వరల్డ్ వైడ్ గా రూ.3 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.5 కోట్లకు పైగా ఉండే అవకాశముంది.
![]() |
![]() |