![]() |
![]() |

'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' వంటి విజయవంతమైన సినిమాల తర్వాత సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) మరో సినిమా చేస్తున్నాడు. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ఫేమ్ స్వరూప్ ఆర్‌ఎస్‌జే ఈ చిత్రానికి దర్శకుడు. తాజాగా ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించారు.
నిజానికి సిద్ధు హీరోగా సితార బ్యానర్ లో గతంలో రెండు సినిమాల ప్రకటనలు వచ్చాయి. సిద్ధు హీరోగా రవికాంత్ పేరేపు దర్శకత్వంలో 'కోహినూర్' అనే భారీ మూవీని అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టి.. ఇదే కాంబినేషన్ లో 'బ్యాడాస్' మరో ఫిల్మ్ ని ప్రకటించారు. ఇప్పుడు అనూహ్యంగా సిద్ధు, స్వరూప్ కాంబోలో కొత్త సినిమా ప్రకటన వచ్చింది. దీంతో 'కోహినూర్' తరహాలోనే 'బ్యాడాస్'ని కూడా పక్కన పెట్టారా? అనే చర్చ జరుగుతోంది.
'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' తర్వాత సిద్ధు చేసిన 'జాక్', 'తెలుసు కదా' సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచాయి. అందుకే కథల ఎంపిక విషయంలో సిద్ధు ఆచితూచి అడుగులు వేసున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కథ బాగా నచ్చి, స్వరూప్ ప్రాజెక్ట్ ని లాక్ చేశాడట. దీని తర్వాత కూడా సితార బ్యానర్ లోనే 'టిల్లు క్యూబ్' చేసే అవకాశముంది.

![]() |
![]() |