![]() |
![]() |
.webp)
గాడ్ ఆఫ్ మాసెస్ 'నందమూరి బాలకృష్ణ'(Balakrishna)నట విశ్వరూపంలో దాగి ఉన్న మరో కోణాన్ని పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై చూపించిన చిత్రం 'అఖండ 2'(Akhanda 2). శివస్థుతుడైన అఘోర గా కళ్ళతోనే బాలయ్య పలికించిన హావభావాలు, డైలాగ్స్ ప్రతి ఒక్కరి చేత 'హరహర మహాదేవ శంభో శంకర' అనేలా చేసాయి. థమన్ మ్యూజిక్ అయితే ఆ అరుపుల స్థాయిని పూనకాల రేంజ్ కి తీసుకెళ్లింది. ఇప్పుడు అఖండ 2 తెలంగాణ ప్రేక్షకులకి, శివ భక్తులకి ఒక తీపి కబురు చెప్పింది. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం.
తెలంగాణ(Telangana)కి సంబంధించి అఖండ 2 టికెట్ రేట్స్ భారీగా తగ్గాయి. సింగల్ స్క్రీన్స్ లో 50 ,80 ,105 రూపాయలతో కూడిన క్లాస్ లుగా ఉండగా, మల్టిప్లెక్స్ 150 రూపాయలు. ఈ మేరకు మేకర్స్ అధికారంగా వెల్లడి చేస్తూ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. ఇక పెంచిన టికెట్ రేట్స్ జనవరి 1 నుంచే అమలులోకి రానున్నాయి. దీంతో అఖండ 2 జోరు సిల్వర్ స్క్రీన్ పై మరింతగా ఉదృతం అవ్వడం ఖాయమనే అభిప్రాయాన్ని అభిమానులు సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఏపీ(Andhrapradesh)లో రిలీజ్ కి ముందు పెంచిన రేట్స్ కాకుండా సాధారణ ధరలు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.

![]() |
![]() |