![]() |
![]() |

-ఏంటి ఆ రికార్డు
-జన నాయగన్ పై భారీ అంచనాలు
-అభిమానులు ఎంత మంది
-మలేషియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు
రికార్డులకి కొత్త పేర్లు వెతికే పనిని కోలీవుడ్ సినీ విశ్లేషకులకి ఇళయ దళపతి 'విజయ్'(Vijay)చాలా సార్లు కల్పించాడు. కానీ కొత్త పేర్లు కనుక్కొనే లోపే వెంటనే మరో కొత్త రికార్డుని విజయ్ సృష్టిస్తుండటంతో సినీ విశ్లేషకులు చేతులెత్తేశారు. అంతలా విజయ్ తన చిత్రాల ద్వారా ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులని సృష్టిస్తు వస్తున్నాడు. కానీ ఇప్పుడు సినిమా ఫంక్షన్ ద్వారా కూడా అదిరిపోయే రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.
మొన్న శనివారం విజయ్ అప్ కమింగ్ మూవీ 'జన నాయగన్'(Jana Nayagan)ఆడియో లాంచ్ వేడుక మలేషియా(Malausia)దేశంలో జరిగిన విషయం తెలిసిందే. ఇండియా వెలుపల జరిగినా కూడా వరల్డ్ వైడ్ గా ఉన్న విజయ్ అభిమానులు మలేషియాకి క్యూ కట్టారు. ఇప్పుడు ఈ విషయంలోనే విజయ్ అరుదైన రికార్డుని అందుకున్నాడు. సుమారు 85000 మంది అభిమానులు ఆ ఈవెంట్ కి హాజరయ్యారు. దీంతో అవుట్ ఆఫ్ కంట్రీ లో జరిగిన తమిళ సినిమా ఆడియో ఈవెంట్ కి సంబంధించి ఆ స్థాయిలో ప్రజలు రావడం అదే తొలిసారి. దీంతో ఈ ఈవెంట్ మలేషియా బుక్ ఆఫ్ రికార్డులో అధికారకంగా చేరింది.
Also read: ఫ్యాన్స్ కి బంపర్ ఆఫర్ ప్రకటించిన అఖండ 2 టీం.. రేట్స్ ఇవే
ఇక జన నాయగన్ జనవరి 9 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుండటంతో ఈ సారి అభిమానులు తమ గుండెల్లో ఆనందాన్ని, భావోద్వేగాన్ని మిక్స్ చేసుకొని మూవీని చూడనున్నారు. ఎందుకంటే జన నాయగాన్ విజయ్ ఆఖరి చిత్రం. ఈ మేరకు విజయ్ అధికారంగా చెప్పడమే కాకుండా పొలిటికల్ గా ప్రజలకి సేవ చేసేందుకే సినిమాలకి స్వస్తి చెప్పనున్నానని వెల్లడి చేసాడు. ఇక జన నాయగన్ లో విజయ్ కి జతగా పూజా హెగ్డే చేస్తుండగా, ప్రేమలు ఫేమ్ మమిత భైజు ఒక ముఖ్య పాత్రలో చేస్తుంది. హెచ్ వినోద్(H Vinoth)దర్శకత్వంలో కే వి ఎన్ ప్రొడక్షన్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుండగా విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నాడు. బాలకృష్ణ , అనిల్ రావిపూడి ల భగవంత్ కేసరి కథ, జన నాయగాన్ కి పోలి ఉండబోతోందనే టాక్ చాలా బలంగానే వినిపిస్తుంది.

![]() |
![]() |