![]() |
![]() |

ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ అండ్ హ్యాపెనింగ్ హీరో విజయ్ దేవరకొండ. అతడితో సినిమాలు చేయడానికి టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఫైటర్' చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. దీని తరవాత దర్శకులు సుకుమార్, శివ నిర్వాణతో సినిమాలు చేయనున్న సంగతి తెలిసిందే. ఆ తరవాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని ఫిలిం నగర్ టాక్.
విజయ్ దేవరకొండ హీరోగా దిల్ రాజు ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేయిస్తున్నారు. దీనికి మోహనకృష్ణ ఇంద్రగంటిని దర్శకుడిగా అనుకున్నారు. 'వి' ఫలితం తేడా కొట్టడంతో ఇంద్రగంటి బదులు బోయపాటి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సినిమా చేయాలని అనుకుంటున్నారట. 'భద్ర' సినిమాతో బోయపాటిని దర్శకుడిగా పరిచయం చేసింది దిల్ రాజే. తరవాత వాళ్ళిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాలేదు. ఇటీవల కరోనా సమయంలో దిల్ రాజుకు బోయపాటి ఒక కథ వినిపించారని, వెంటనే దిల్ రాజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. విజయ్ దేవరకొండకు త్వరలో కథ వినిపించనున్నారని తెలుస్తోంది.
![]() |
![]() |