![]() |
![]() |

ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే తమిళ కథానాయకుల్లో ధనుష్ ఒకరు. తన విలక్షణ నటనతో ఇప్పటికే రెండు జాతీయ పురస్కారాలు కూడా పొందారాయన. రీసెంట్ గా 'కర్ణన్'తో థియేటర్స్‌లో సందడి చేసిన ధనుష్.. త్వరలో కొత్త సినిమాతో ఓటీటీలో పలకరించనున్నారు. ఆ చిత్రమే.. 'జగమే తందిరమ్'. కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాతో ధనుష్ నటుడిగా 40 సినిమాలను పూర్తిచేసుకుంటున్నారు. ఇందులో అతనికి జోడీగా ఐశ్వర్యా లక్ష్మి నటించింది.
ఇదిలా ఉంటే.. 'జగమే తందిరమ్'ని దిగ్గజ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ చేయనున్నారు. జూన్ 11న గానీ లేదంటే జూన్ 13న గానీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశముందని కోలీవుడ్ టాక్. మే 14న విడుదల కానున్న ట్రైలర్ లో స్ట్రీమింగ్ డేట్ పై క్లారిటీ ఇవ్వనున్నారట.
ధనుష్ గ్యాంగ్‌స్టర్ రోల్‌లో నటించిన 'జగమే తందిరమ్' తెలుగులో 'జగమే తంత్రమ్' పేరుతో అనువాదం కానుంది. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, వైనాట్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంతోష్ నారాయణన్ బాణీలు అందించారు.
![]() |
![]() |