![]() |
![]() |

అక్కినేని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా `లవ్ స్టోరి`. `మజిలీ`, `వెంకిమామ` వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తరువాత యువ సామ్రాట్ నాగచైతన్య నుంచి వస్తున్న చిత్రం కావడంతో `లవ్ స్టోరి`పై మంచి అంచనాలే ఉన్నాయి. అలాగే `ఫిదా` వంటి బ్లాక్ బస్టర్ అనంతరం శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన సినిమా కావడం.. అదేవిధంగా సాయిపల్లవి నాయిక కావడంతో పాటు పాటలు కూడా విశేషాదరణ పొందడంతో `లవ్ స్టోరి` బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తుందన్న ఆశలతో ఉన్నారు అక్కినేని ఫ్యాన్స్. అందుకు తగ్గట్టే.. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న `లవ్ స్టోరి` రాబోతోంది.
ఇదిలా ఉంటే.. సరిగ్గా అదే రోజున మరో క్రేజీ ప్రాజెక్ట్ విడుదల కాబోతోంది. ఆ చిత్రమే.. `తలైవి`. ప్రముఖ నటీమణి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా రూపొందిన ఈ బయోపిక్ లో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ టైటిల్ రోల్ లో నటించింది. ఎ.ఎల్. విజయ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా కూడా సెప్టెంబర్ 10న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. మరి.. చైతూ వర్సెస్ కంగనా అన్నట్లుగా ఉన్న ఈ బాక్సాఫీస్ వార్ లో ఎవరు విన్నర్ గా నిలుస్తారో చూడాలి.
![]() |
![]() |