![]() |
![]() |

`సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు` అనే ట్యాగ్ తో తెరంగేట్రం చేసినా.. అనతికాలంలోనే నటుడిగా తనదైన ముద్ర వేశాడు సుధీర్ బాబు. ఈ క్రమంలోనే.. `ప్రేమకథా చిత్రమ్`, `సమ్మోహనం` వంటి రొమాంటిక్ ఎంటర్టైనర్స్ తో మంచి విజయాలు చూశాడు. అయితే, ఆ తరువాత మాత్రం ఆ స్థాయి విజయాలు తన ఖాతాలో చేరలేదు.
ఈ నేపథ్యంలోనే.. ఈ శుక్రవారం (ఆగస్టు 27) తన కొత్త చిత్రం `శ్రీదేవి సోడా సెంటర్`తో పలకరించబోతున్నాడు సుధీర్ బాబు. `పలాస` ఫేమ్ కరుణ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాలో ఫెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలో అలరించబోతున్నాడు సుధీర్ బాబు. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఆగస్టు 27 సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో ఓ ఐకానిక్ డేట్. 1971లో ఇదే తేదిన కృష్ణ నటించిన కౌబాయ్ మూవీ `మోసగాళ్ళకు మోసగాడు` విడుదలై అఖండ విజయం సాధించింది. అలాంటి మెమరబుల్ డేట్ కి ఇప్పుడు సుధీర్ బాబు సినిమా రాబోతోంది. ప్రచార చిత్రాలు, పాటలకు దక్కిన ఆదరణ.. సినిమాకి కూడా దక్కితే సుధీర్ ఖాతాలో మరో విజయం చేరినట్లే. మరి.. తన మామగారి కెరీర్ లో ఐకానిక్ డేట్ గా నిలిచిపోయిన ఆగస్టు 27.. తన కెరీర్ కి కూడా ప్లస్ అవుతుందేమో చూడాలి.
![]() |
![]() |