![]() |
![]() |

అక్కినేని బుల్లోడు అఖిల్ టైటిల్ రోల్ లో నటించిన చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`. బుట్టబొమ్మ పూజా హెగ్డే నాయికగా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి `బొమ్మరిల్లు` భాస్కర్ దర్శకత్వం వహించారు. గోపీసుందర్ స్వరాలు అందించారు.
ఇదిలా ఉంటే.. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` విడుదల తేదికి సంబంధించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. విజయదశమి కానుకగా అక్టోబర్ 13న ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న `ఆర్ ఆర్ ఆర్`.. మొదట అనుకున్నట్లుగా అక్టోబర్ 13న కాకుండా 2022కి వాయిదా పడే దిశగా ఉండడం వల్లే ఈ డేట్ ని లాక్ చేసినట్లు టాక్. మరి.. ఈ కథనాల్లో వాస్తవమెంతో తెలియాలంటే కొద్ది రోజులు వేచిచూడాల్సిందే.
కాగా, అఖిల్ కథానాయకుడిగా నటించిన మొదటి మూడు చిత్రాలు `అఖిల్`, `హలో`, `మిస్టర్ మజ్ను` ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో.. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` ఫలితం అతనికి కీలకంగా మారింది.
![]() |
![]() |