![]() |
![]() |
.webp)
హీరో గోపీచంద్ మార్చి 8 న భీమాతో కెరీర్ లో మొదటి సారి పాన్ ఇండియా లెవల్లో ల్యాండ్ అవ్వబోతున్నాడు.ఈ మూవీపై గోపీచంద్ అభిమానుల్లోను ,ప్రేక్షకుల్లోను భారీ అంచనాలే ఉన్నాయి. రిలీజ్ కి దగ్గర పడటంతో మూవీ ప్రమోషన్స్ లో వేగం కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో గోపీచంద్ ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.
ఒక జర్నలిస్ట్ గోపీచంద్ తో మీ తండ్రి అయిన దివంగత దర్శకుడు టి కృష్ణ గారిలా ఇప్పుడు ఎవరు సామాజిక నేపథ్యంతో కూడిన సినిమాలు చెయ్యడం లేదేంటనే ప్రశ్నని లేవనెత్తాడు.ఇప్పుడున్నదర్శక, రచయితలు ప్రజలతో తిరగడం లేదు. అందుకే సామజిక సమస్యలతో కూడిన సినిమాలు రావటం లేదు. డీవీడీ లు ,ఇంగ్లీష్ సినిమాలు చూస్తున్నారని అలాంటప్పుడు సామాజిక సినిమాలు ఎలా వస్తాయనే సంచలన వ్యాఖ్యల్ని గోపీచంద్ చేసాడు. అప్పట్లోని దర్శక రచయితలందరు బయట జనాలతో తిరిగే వారు. వాళ్ళ కష్టాలని దగ్గరుండి చూసే వారు. వాళ్ళ జీవితాలనే సినిమాలుగా తెరకెక్కించేవారని చెప్పాడు. ఇలా చెప్పడం తప్పో ఒప్పో కూడా తనకి తెలియదని చెప్పుకొచ్చాడు.శంకర్ లాంటి దర్శకులు తో పాటు కొంత మంది యువ దర్శకులు సామాజిక సినిమాల ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకొచ్చాడు.

భీమాలో అన్ని కమర్షియల్ అంశాలు ఉన్నాయని థియేటర్ నుంచి బయటకి వచ్చాక కూడా ప్రేక్షకుడు మా సినిమా గురించి ఆలోచిస్తాడని చెప్పాడు. అలాగే కొంత మంది అఖండ తో పోల్చుతున్నారని అలా పోల్చడం మంచిదే కదా అని కూడా చెప్పాడు. కాకపోతే మా సినిమా కథ కి అఖండ కి ఎలాంటి సంబంధం ఉండదు. ఈ విషయాన్ని రేపు 8 న ప్రేక్షకులే ఒప్పుకుంటారు అని కూడా చెప్పాడు. కన్నడ దర్శకుడు హర్ష వర్ధన్ తెరకెక్కించిన భీమాలో ప్రియా భవాని శంకర్, మాళవిక లు హీరోయిన్ లుగా నటించారు. పోలీసు ఆఫీసర్ తో పాటు ఇంకో డిఫరెంట్ క్యారక్టర్ లో గోపీచంద్ మెరవబోతున్నాడు.
![]() |
![]() |