![]() |
![]() |

నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ పెళ్లి ఘడియలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఈ రోజు రాత్రి 7 గంటలకు ఆ ఇద్దరూ దంపతులుగా మారబోతున్నారు. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఉదయ్‌పూర్‌లో పెళ్లి వేదిక దగ్గర తెగ సందడి చేసేస్తున్నారు. అక్కడి కోలాహలం చూస్తుంటే నిహారిక అంటే ఆ ఫ్యామిలీకి ఎంత ముద్దో అర్థమవుతోంది. అంతేకాదు, మనం ఇప్పుడు కొవిడ్ మహమ్మారి కాలంలో ఉన్నామంటే నమ్మబుద్ధి వేయడం లేదు. అంతగా అక్కడ పండగ సందడి కనిపిస్తోంది.
మంగళవారం రాత్రి జరిగిన నిహారిక మెహందీ వేడుక జోరుగా హుషారుగా సాగింది. మెగాస్టార్ చిరంజీవి సూపర్‌హిట్ సాంగ్ బంగారు కోడిపెట్ట సాంగ్‌కు చిరు, బన్నీ కలిసి స్టెప్పులేశారు. మొదట బన్నీని స్టెప్పులేయాల్సిందిగా అక్కడ ఉన్నవాళ్లంతా కోరగా, బన్నీ మొహమాటంతో వేయలేనని చెప్పాడు. దాంతో చిరు ముందుకు వచ్చి డాన్స్ చేశారు. అప్పడు బన్నీ కూడా మూవ్‌మెంట్స్ ప్రదర్శించాడు. కాసేపయ్యాక చిరు సతీమణి సురేఖ సైతం చిరు పక్కన నిల్చొని డాన్స్ చేయడం అందరిలో జోష్ నింపింది. అమ్మ డాన్స్ చూసి, పెద్దమ్మాయి సుస్మిత ఆమె దగ్గరకు వచ్చి కౌగలించుకుంది. దీనికి సంబంధించి వీడియో క్లిప్ ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది.
.jpg)
కాగా అక్కడి కొన్ని అందమైన క్షణాలకు సంబంధించిన పిక్చర్స్‌ను బన్నీ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశాడు. ఒక పిక్చర్‌లో బన్నీ, రామ్‌చరణ్‌లతో కలిసి వధూవరులు నిహారిక, చైతన్య విజిల్స్ వేస్తూ డాన్స్ చేస్తున్నారు. మరో దానిలో చిరు, బన్నీ, చిరంజీవి పెద్దల్లుడు, కూతురు నవ్వులు చిందిస్తున్నారు. ఇంకో పిక్చర్‌లో వధూవరులతో బన్నీ నిల్చొని కనిపిస్తుండగా, మరో బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో అన్న రామ్‌చరణ్‌ను నిహారిక కౌగలించుకోగా, వరుడు చైతన్యతో పాటు, బన్నీ, శిరీష్, సాయితేజ్ పగలబడి నవ్వుతున్నారు. మొత్తానికి ఉదయ్‌పూర్‌లో మెగా సందడి మామూలుగా లేదనిపిస్తోంది.


![]() |
![]() |