![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్లందరినీ ఉరుకులు పరుగులు పెట్టిస్తూ నాలుగోవారం గడిచింది. వీకెండ్ షోలో ఎలిమినేషన్ జాబితాలో ఉన్న కంటెస్టెంట్ల మధ్య పోటీలు పెడుతూ ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తూ సాగే ఎలిమినేషన్ ప్రక్రియ ఈ సారి ఊహించని రీతిలో బుల్లెట్ లా పేలింది. వెల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన స్వాతి దీక్షిత్ వారం రోజులకే ఇంటిదారి పట్టింది. మెహబూబ్, హారికలలో ఒకరు ఇంటిదారి పడతారు అనుకున్న ఇంటిసభ్యుల, ప్రేక్షకుల అంచనాలను తారుమారు చేశారు నాగ్.
ఎలిమినేషన్ జాబితాలో ఉన్నవారందరికి టాస్క్ లు ఇస్తూ ఒక్కక్కరిని సేఫ్ జోన్ లోకి తీసుకువచ్చే నాగ్ ఈ వారం మాత్రం గన్ ఇచ్చి సుసైడ్ చేసుకోమన్నారు. దాంతో ఎలిమినేషన్ లో ఉన్న ఏడుగురు వరుసగా ట్రిగ్గర్ నొక్కారు. ఒక రౌండ్ మొత్తం అయినా గన్ పేలలేదు. దాంతో మరోసారి ప్రయత్నించమన్నారు నాగ్. రెండో ప్రయత్నంలో చివరగా స్వాతి చేతిలో గన్ పేలింది. దాంతో ఎలిమినేషన్ బుల్లెట్‌కు స్వాతి టార్గెట్ అయ్యింది. ఆమె చేతిలో గన్ నుంచి బుల్లెట్ సౌండ్ రాగానే ఇంటిసభ్యులంతా ఆశ్చర్యపోయారు. స్వాతి అయితే షాక్ తింది. మెహబూబ్, హారికలలో ఒక్కరు ఎలిమినేట్ అవుతారన్న అంచనా తప్పింది.
.jpg)
స్వాతి ఇంటిదారి పట్టడంతో నోయల్ బోరున ఏడ్చేశాడు. స్వాతి హౌస్ లోకి అడుగుపెట్టిన ఫస్ట్ డేనే నాలుగు మెల్ కంటెస్టెంట్లతో పార్టీ చేసుకున్నారు. హౌస్ లో సందడి మొదలు అనుకున్నారు ప్రేక్షకులు. కానీ వారంరోజులకే హౌస్ నుంచి ఆమె బయటకు రావడంతో ఇంటిసభ్యులతో పాటు ప్రేక్షకులు బాధపడ్డారు. వారంరోజుల తన బిగ్ హౌస్ జర్నీ గురించి స్వాతి ఏం చెప్తుందో సండే ఎపిసోడ్ లో చూడాల్సిందే..
![]() |
![]() |