![]() |
![]() |

చిరంజీవి టైటిల్ రోల్ పోషించిన లేటెస్ట్ మూవీ 'ఆచార్య'. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషించాడు. ఈ మూవీ ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. తండ్రీకొడుకులు కలిసి నటించిన ఈ మెగా మూవీపై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్లే ప్రీరిలీజ్ బిజినెస్ భారీస్థాయిలో జరిగింది.
ఆచార్య మూవీ వరల్డ్ వైడ్ గా రూ.131.20 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. దీంతో టాలీవుడ్ లో అత్యధిక బిజినెస్ చేసిన సినిమాల లిస్టులో ఏడో స్థానంలో నిలిచింది. అయితే చిరంజీవి గతం చిత్రం 'సైరా నరసింహారెడ్డి' కంటే ఆచార్య బిజినెస్ చాలా తక్కువ జరగడం విశేషం. సైరా మూవీ వరల్డ్ వైడ్ గా 187.25 కోట్ల బిజినెస్ చేసి ఐదో స్థానంలో ఉంది. అయితే సైరాను అప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో భారీగా విడుదల చేశారు. ఒక్క హిందీలోనే 25 కోట్ల బిజినెస్ చేసింది. అలాగే కర్ణాటకలోనూ భారీగా 26.25 కోట్ల బిజినెస్ చేసింది. అయితే ఇప్పుడు ఆచార్యను హిందీలో రిలీజ్ చెయ్యట్లేదు. దానికి తోడు కర్ణాటకలో 9 కోట్ల బిజినెస్ మాత్రమే చేసింది. అందుకే సైరాతో పోల్చితే ఆచార్య బిజినెస్ తక్కువగా జరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆచార్య మూవీ సైరాను మించి బిజినెస్ చేసింది. సైరా మూవీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి 106.80 కోట్ల బిజినెస్ చేయగా.. ఆచార్య 107.50 కోట్లు చేసింది. నైజాంలో 38 కోట్లు, సీడెడ్ లో 18.50 కోట్లు, ఆంధ్రాలో 51 కోట్లకు ఆచార్య రైట్స్ అమ్ముడయ్యాయి. అలాగే కర్ణాటకలో 9 కోట్లు, రెస్టాఫ్ ఇండియా 2.70 కోట్లు, ఓవర్సీస్ లో 12 కోట్లకు రైట్స్ అమ్ముడవ్వడంతో ఆచార్య వరల్డ్ వైడ్ గా 131.20 కోట్ల బిజినెస్ చేసింది.
ట్రేడ్ వర్గాల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో 106.40 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన సైరా.. వరల్డ్ వైడ్ గా 143.80 కోట్ల షేర్ రాబట్టింది. ఇప్పుడు ఆచార్యకు తెలుగు రాష్ట్రాల్లో హైక్ లభించడంతో పాటు.. చిరు, చరణ్ కలిసి నటించిన సినిమా కావడంతో ఈ సినిమా 150 కోట్ల షేర్ మార్క్ ని అందుకునే అవకాశముంది అంటున్నారు.
![]() |
![]() |