![]() |
![]() |

ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు గాలి జనార్దనరెడ్డి కుమారుడు కిరీటి హీరోగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం నిర్మిస్తున్న ఈ తెలుగు-కన్నడ ద్విభాషా చిత్రానికి రాధాకృష్ణ దర్శకుడు. అప్పటి స్టార్ హీరోయిన్ జెనీలియా పదేళ్ల తర్వాత ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తోంది. 'పెళ్లి సందD' ఫేమ్ శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

కిరీటి డెబ్యూ మూవీ శుక్రవారం నాడు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి దర్శక ధీరుడు రాజమౌళితో పాటు ఎందరో సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ముహూర్తం షాట్ కు రాజమౌళి క్లాప్ కొట్టగా, కన్నడ స్టార్ రవిచంద్ర వి కెమెరా స్విచాన్ చేశారు. అంతేకాదు కిరీటి ఇంట్రడక్షన్ టీజర్ ని కూడా ఈరోజు విడుదల చేశారు. ఇందులో స్టంట్స్, డ్యాన్స్ స్టెప్స్ తో కిరీటి అదరగొట్టాడు.

ఈ సినిమాకి ఎందరో ప్రముఖులు పని చేస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రఫర్ గా కె సెంథిల్ కుమార్, స్టంట్ కొరియోగ్రాఫర్ గా పీటర్ హెయిన్ పని చేస్తున్నారు. ఇలా టాప్ టెక్నిషియన్స్ తో ఎంట్రీ ఇస్తున్న కిరీటి తెలుగు, కన్నడ ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తాడో చూడాలి.
![]() |
![]() |