![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కొత్త చిత్రంలో ముచ్చటగా ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయబోతున్నారా? అవునన్నదే ఫిల్మ్ నగర్ బజ్.
ఆ వివరాల్లోకి వెళితే.. `గబ్బర్ సింగ్` (2012) వంటి సంచలన చిత్రం తరువాత స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్ లో పవన్ మరో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. `భవదీయుడు.. భగత్ సింగ్` అనే పేరుతో తెరకెక్కనున్న ఈ భారీ బడ్జెట్ వెంచర్ ని.. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్ఠాత్మంగా నిర్మించనుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి బాణీలు అందిస్తున్నారు.
కాగా, కళాశాల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో పవన్ ఓ లెక్చరర్ గా కనిపించనుండగా.. అతనికి జోడీగా ముగ్గురు కథానాయికలు సందడి చేయనున్నారట. వారిలో ఒకరిగా ఇప్పటికే బుట్టబొమ్మ పూజా హెగ్డేని ఎంపిక చేశారట. మిగిలిన ఇద్దరు నాయికలెవరన్నది త్వరలోనే క్లారిటీ రానుంది. అంతేకాదు.. ఇందులో ఓ స్పెషల్ సాంగ్ ఉందని, ఆ పాట కోసం మరో హీరోయిన్ తళుక్కున మెరవనుందని టాక్. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.
ఇదిలా ఉంటే, పవన్ ప్రస్తుతం `హరిహర వీరమల్లు`లో నటిస్తున్నారు. వెర్సటైల్ కెప్టెన్ క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో పవన్ కి జంటగా నిధి అగర్వాల్ నటిస్తోంది.
![]() |
![]() |