![]() |
![]() |

ఇరుది సుట్రు, సాలా ఖడూస్, గురు, సూరారై పొట్రు (ఆకాశం నీ హద్దురా).. ఇలా విజయవంతమైన చిత్రాలతో ముందుకు సాగుతున్నారు లేడీ డైరెక్టర్ సుధ కొంగర. మరీ ముఖ్యంగా.. 'ఆకాశం నీ హద్దురా'తో దర్శకురాలిగా ఆమె స్థాయి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో.. సుధ తదుపరి చిత్రంపై సర్వత్రా ఎనలేని ఆసక్తి నెలకొంది.
ఆ మధ్య కోలీవుడ్ స్టార్ అజిత్ తో సుధ నెక్స్ట్ వెంచర్ ఉంటుందని ప్రచారం సాగింది. అయితే, అజిత్ ఇప్పుడు వేరే ప్రాజెక్టులతో బిజీ కావడంతో.. సుధ మరో కథానాయకుడి కోసం కథ సిద్ధం చేశారట. ఆ హీరో మరెవరో కాదు.. సూర్య తమ్ముడు, తెలుగు, తమిళ భాషల్లో నటుడిగా తనదైన ముద్ర వేసిన కార్తి. త్వరలోనే కార్తి, సుధ కాంబినేషన్ మూవీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
సూర్య, కార్తి.. ఇలా అన్నదమ్ములతోనే సుధ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ రూపొందడం ఆసక్తికరమనే చెప్పాలి. 'ఖైదీ' చిత్రంతో తెలుగులోనూ ఘన విజయం సాధించిన కార్తి ప్రస్తుతం 'సుల్తాన్' సినిమా చేస్తున్నాడు.
![]() |
![]() |