![]() |
![]() |
నేచురల్ స్టార్ నానిని డిఫరెంట్‌గా ప్రజెంట్ చేస్తూ.. అతనికి ఒక కొత్త ఇమేజ్‌ని తీసుకురావాలని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. నానికి దసరా వంటి బ్లాక్ బస్టర్‌ని ఇచ్చిన శ్రీకాంత్.. ఇప్పుడు చేస్తున్న సినిమా ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ అయిన దగ్గర నుంచి సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో మోహన్‌బాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది తెలియడం కోసం మోహన్‌బాబు లుక్‌ని విడుదల చేశారు. తన నేచురల్ యాక్టింగ్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌ని సైతం బాగా ఆకట్టుకున్న నాని ఈ సినిమాలో తన కొత్త లుక్‌తో అందరికీ షాక్ ఇచ్చాడు.
చాలా కాలం తర్వాత మోహన్‌బాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో అతని క్యారెక్టర్ ఎలా ఉండబోతోందనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. ప్రేక్షకులకు మరోసారి షాక్ ఇస్తూ మోహన్‌బాబు లుక్ రిలీజ్ చేశారు. అతని గెటప్ చూస్తుంటే సినిమాలో తన విశ్వరూపం చూపించాడేమో అనిపిస్తుంది. ఈ లుక్ విడుదలైన తర్వాత కెరీర్‌లో ‘ది ప్యారడైజ్’ మరో సెస్సేషనల్ మూవీ అవుతుందన్న పాజిటివ్ బజ్ వినిపిస్తోంది.
![]() |
![]() |